Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఇవాళ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

అసాధారణమైన ధైర్యసాహసాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐటీబీపీ హిమవీరులను ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రతి సవాలును అసాధారణ పట్టుదలతో ఎదుర్కొన్నారని కొనియాడారు. వారి నిస్వార్థ సేవలు, త్యాగాలు దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు.

ఐటీబీపీ హిమవీరులు అసాధారణమైన శౌర్యంతో ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు.

ప్రతి సవాలును అద్భుతమైన పట్టుదలతో ఎదుర్కొన్నారు.

వారి నిస్వార్థ సేవలు, త్యాగాలు దేశానికి అపారమైన స్ఫూర్తినిస్తున్నాయి.

@ITBP_official “