ఆసియా పారా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ టీ47 విభాగంలో రజత పతకం సాధించిన నిమిషా చక్కుంగల్పరంబిల్ సురేశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఆమె అంకితభావం, కఠోర శ్రమ భారత పారా క్రీడాకారులకు మరో గర్వకారణమైన విజయాన్ని అందించాయని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధిస్తూ రాణించాలని ఆకాంక్షించారు. రాబోయే పోటీల్లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
‘‘ఆసియా పారా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ టీ47 విభాగంలో రజత పతకం సాధించిన నిమిషా చక్కుంగల్పరంబిల్ సురేశ్‌కు అభినందనలు. ఆమె అంకితభావం, కఠోర శ్రమ భారత పారా క్రీడాకారులకు మరో గర్వకారణమైన విజయాన్ని అందించాయి. ఆమె ఇలాగే రాణిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో జరిగే పోటీల్లో ఆమెకు శుభాకాంక్షలు’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Congratulations to Nimisha Chakkungalparambil Suresh on winning Silver in the Women’s Long Jump T47 event at the Asian Para Games! Her dedication and hard work have brought another proud moment for Indian para athletics. May she continue to shine and achieve greater success. Wishing her the very best for future competitions: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026