ఆసియా పారా క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్40/ఎఫ్41 విభాగంలో కాంస్య పతకం సాధించిన నవదీప్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
గత ఆసియా పారా క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన నవదీప్ ఈసారి మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అతను అద్భుతంగా రాణిస్తూ దేశానికి మరింత గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ఆసియా పారా క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్40/ఎఫ్41 విభాగంలో కాంస్య పతకం సాధించిన నవదీప్కు అభినందనలు. గత పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచిన అతను ఈసారి మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. భవిష్యత్తులోనూ అద్భుతంగా రాణిస్తూ భారత్కు మరింత గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Congratulations to Navdeep on winning Bronze in the Men’s Javelin Throw F40/F41 event at the Asian Para Games! Improving on his fourth-place finish from the previous edition makes this achievement special. May he continue to excel and bring more pride to India: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026