Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, అనిశ్చితిని స్వీకరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలంటున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


సంశయాలను తీర్చుకోవడానికి, అనిశ్చిత పరిస్థితులను అంగీకరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలనే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
‘న సంశయమనారుహ్య నరో భద్రాణి పశ్యతి
సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి’ అన్న సంస్కృత శ్లోకాన్ని ఆయన ఉదాహరించారు.
పై శ్లోకానికి అర్థం ఇదీ..
సంశయాన్నుంచి విముక్తిని పొందినప్పుడు వ్యక్తి మంచి అవకాశాలను గుర్తించగల సామర్థ్యాన్ని పొందవచ్చును. అలాగే అనిశ్చిత పరిస్థితులకు ఎదురొడ్డి నిలవడం వల్ల గాఢమైన అవగాహనను, అంతర్‌దృష్టిని పెంపొదింపచేసనుకోవచ్చును. ఇది జీవితంలో సవాళ్లను ఎదురించడంలో చక్కని వివేకం, సాహసం, దృఢత్వాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గురించి కూడా ప్రస్తావిస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘న సంశయమనారుహ్య నరో భద్రాణి పశ్యతి
సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి’ అని పేర్కొన్నారు.