Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ్ఞానం, వివేకం, సత్ప్రవర్తనలకున్న ప్రాధాన్యాన్ని బోధించే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


మనిషి తన జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వివేకాన్ని, కర్మలను, సత్ప్రవర్తనను కలబోసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
‘‘శాస్త్రం కర్మ తథా ప్రజ్ఞా శీలం క్రియయాన్వితమ్
లక్ష్యలక్షణయుక్తార్థశాస్త్రనిష్ఠో నరో భవేత్’’ అన్న సంస్కృత శ్లోకాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
శాస్త్ర జ్ఞానానికి వివేకాన్ని, క్రమశిక్షణను, కార్య కుశలతను సమన్వయ పరుచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అలా చేసినప్పుడే మనిషి ప్రజ్ఞాభరిత, ప్రయోజనాత్మక జీవితానికి పునాది ఏర్పడుతుందని ఈ శ్లోకం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
శాస్త్రం కర్మ తథా ప్రజ్ఞా శీలం క్రియయాన్వితమ్
లక్ష్యలక్షణయుక్తార్థశాస్త్రనిష్ఠో నరో భవేత్ అని పేర్కొన్నారు.