వ్యక్తులు, కుటుంబాలతో పాటు సమాజం మనుగడకు కీలకంగా నిలిచే విలువలను గురించి బోధిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ శ్లోకం.. సత్యంతో ధర్మాన్ని రక్షించవచ్చని, క్రమం తప్పని విద్యాభ్యాసం ద్వారా జ్ఞానాన్ని సంరక్షించవచ్చని, స్వచ్ఛతతో రూప సౌందర్యాన్ని కాపాడుకోవచ్చని, అలాగే మంచి నడవడిక ద్వారా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టవచ్చని బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘సత్యేన రక్ష్యతే ధర్మో విద్యాభ్యాసేన రక్ష్యతే
మృజయా రక్ష్యతే రూపం కులం వృత్తేన రక్ష్యతే’’ అని పేర్కొన్నారు.
सत्येन रक्ष्यते धर्मो विद्याभ्यासेन रक्ष्यते। मृजया रक्ष्यते रूपं कुलं वृत्तेन रक्ष्यते॥ https://t.co/uLkWv4S8wd
— Narendra Modi (@narendramodi) November 5, 2026