Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవర్ధన్ పూజ సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు మంగళప్రదమైన ‘గోవర్ధన్ పూజ’. ఈ సందర్భంగా పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ సుఖం, సౌభాగ్యం, సమృద్ధి కలగాలని ఆయన కోరుకుంటూ, ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తితో పాటు కొత్త ఉత్సాహాన్ని ప్రసాదిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భగవాన్ శ్రీ కృష్ణుడిని స్తుతించే సంస్కృత సుభాషితాన్ని కూడా ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘గోవర్ధన్ పూజ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభకామనలు. ఈ పవిత్ర పర్వదినం మీ అందరి జీవితంలో కొత్త శక్తినీ, కొత్త ఉత్సాహాన్నీ కలగజేయుగాక. అందరికీ సుఖం, సౌభాగ్యం, సమృద్ధి విరివిగా ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.

ఆభీరనగరీప్రాణప్రియం సత్యపరాక్రమమ్

స్వభృత్యభయభేత్తారం గోవర్ధనధరం భజే

గోవర్ధనగిరిధారి, బ్రజ నివాసుల ప్రియతముడు, అమిత పరాక్రమవంతుడు, భక్తగణం భయాల్ని తరిమికొట్టే వాడు భగవాన్ శ్రీ కృష్ణునికి ప్రణమిల్లుతున్నాను’’ అని పేర్కొన్నారు.

***