Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అధ్యక్షుడు శ్రీ వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ప్రధానమంత్రి మాటామంతీ


ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.

ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించిన తాజా పరిణామాలపై  అధ్యక్షుడు శ్రీ జెలెన్‌స్కీ తన దృష్టికోణాన్ని వివరించారు.

మానవత ప్రధానమన్నదే భారత్ వైఖరి అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సంఘర్షణకు పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ బలంగా కోరుకుంటున్నదని ఆయన పునరుద్ఘాటించారు. శాంతియుత పరిష్కారం ద్వారా సంఘర్షణ సమసిపోయేటట్లు చూసే దిశగా సాగే సకల ప్రయత్నాలకు సాయాన్ని అందించేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

ఇరు దేశాల ప్రజలకు పరస్పరం లాభదాయకంగా ఉండగల, వివిధ రంగాల్లో భారత్– ఉక్రెయిన్ ద్వైపాక్షిక సహకారాన్ని ఇప్పటి కన్న పటిష్ఠపరచగల విధానాలపై నేతలిద్దరూ చర్చించారు.