ఝార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గిరిజనుల ఆత్మగౌరవం, సాంస్కృతిక వైవిధ్యం, సహజ సంపదల అద్వితీయ సంగమంగా ఝార్ఖండ్ను ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని దట్టమైన అడవులు, సుందర జలపాతాలు, చారిత్రక ప్రదేశాలు దాని ప్రత్యేక గుర్తింపును మరింత సుసంపన్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, భగవాన్ బిర్సా ముండా శౌర్యపరాక్రమం, త్యాగంతో కూడిన కథల నుండి ఈ రాష్ట్ర సంప్రదాయాలు నిరంతర స్ఫూర్తి పొందుతాయని తెలిపారు. ఖనిజాలు, ఇంధనం నుంచి హస్తకళలు, పర్యాటకం దాకా రాష్ట్ర సామర్థ్యం అపారమని వివరించారు. ప్రతిభావంతులు, శ్రమజీవులైన పౌరుల సంకల్పం, సామర్థ్యాల దన్నుతో ఝార్ఖండ్ సరికొత్త ప్రగతి శిఖరాలను చేరగలదని ప్రధానమంత్రి ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రావతరణ శుభ సందర్భాన ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యసౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా పంపిన సందేశంలో:
“జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సోదరీసోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
గిరిజనుల ఆత్మగౌరవం, సాంస్కృతిక వైవిధ్యం, సహజ సంపదల విశిష్ట సంగమమైన ఈ రాష్ట్రంలో దట్టమైన అడవులు, రమణీయ జలపాతాలు, చారిత్రక ప్రదేశాలు దీని ప్రత్యేక గుర్తింపును మరింత సుసంపన్నం చేస్తున్నాయి.
భగవాన్ బిర్సా ముండా శౌర్యపరాక్రమం, త్యాగాల గాథ ఇక్కడి సంప్రదాయాలకు సదా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
ఖనిజాలు, ఇంధనం నుంచి హస్తకళలు, పర్యాటకం వరకూ అపార శక్తిసామర్థ్యాలు, వనరులు ఈ రాష్ట్రానికి ఉన్నాయి.
శ్రమజీవులు, ప్రతిభావంతులైన ఈ రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యుల సంకల్పం, సామర్థ్యంతో ఝార్ఖండ్ సరికొత్త ప్రగతి శిఖరాలను అధిరోహించగలదని దృఢంగా విశ్వసిస్తున్నాను.
ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానందాలు, సుఖసౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
झारखंड के सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं! हमारा यह प्रदेश जनजातीय गौरव, सांस्कृतिक विविधता और प्राकृतिक संपदा का अनूठा संगम है। यहां के घने वन, मनोरम जलप्रपात और ऐतिहासिक स्थल इसकी विशिष्ट पहचान को समृद्ध करते हैं। भगवान बिरसा मुंडा जी की वीरता और बलिदान की गाथाओं से यहां की परंपराओं को निरंतर प्रेरणा मिलती रही है। खनिज और ऊर्जा से लेकर हस्तशिल्प और पर्यटन तक इस राज्य में अपार संभावनाएं हैं। मुझे विश्वास है कि यहां के मेरे मेहनती और प्रतिभाशाली परिवारजनों के संकल्प और सामर्थ्य के बल पर यह प्रदेश विकास की नई ऊंचाइयों को छुएगा। मेरी कामना है कि यह विशेष अवसर यहां के सभी लोगों के जीवन में सुख-समृद्धि और खुशहाली लेकर आए।
— Narendra Modi (@narendramodi) November 15, 2026