Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిలిప్పిన్స్‌లోని మనీలాలో ఖల్సా దివాన్ గురుద్వారాను సందర్శించిన ప్రధానమంత్రి

పిలిప్పిన్స్‌లోని మనీలాలో ఖల్సా దివాన్ గురుద్వారాను సందర్శించిన ప్రధానమంత్రి


మనీలాలోని ఖల్సా దివాన్ గురుద్వారాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సందర్శించారు. పంజ్ ప్యారే సమక్షంలో గురుద్వారా పునరాభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ గౌరవ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎస్కుడెరో, మనీలా నగర మేయర్ గౌరవ శ్రీ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనోలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

1901లో స్థాపించిన ఈ సంస్థ, 1903లో అధికారికంగా రూపుదిద్దుకుని 1924లో ఖల్సా దివాన్‌గా నమోదైంది. మనీలాలోని ఖల్సా దివాన్ గురుద్వారా ఫిలిప్పీన్స్‌లోని అత్యంత పురాతన గురుద్వారాగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది సిక్కులతో పాటు మనీలాలోని ఇతర వర్గాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల ద్వారా కీలక పాత్రను నిర్వర్తిస్తోంది.

ఖల్సా దివాన్ గురుద్వారా భారత–సిక్కు సమాజానికి, ఫిలిప్పీన్స్ సమాజానికి మధ్య కీలక వారధిలా నిలుస్తోంది.