Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత రాజ్యాంగ వైశిష్ట్యం, సామాజిక – ఆర్థిక న్యాయాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వ కృషిని వివరించే ప్రత్యేక వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని


భారత రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్తు విశిష్టతను, తన ప్రయాణంలో రాజ్యాంగం ఒక విడదీయరాని భాగంగా మారిన తీరును వివరిస్తూ తాను రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని (ఓపీఈడీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక, ఆర్థిక న్యాయాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ఈ వ్యాసంలో వివరించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఈ ప్రత్యేక వ్యాసంలో కింది అంశాలను ప్రధానంగా ప్రస్తావించాను:

మన రాజ్యాంగం, రాజ్యాంగ సభ విశిష్టత.

నా ప్రయాణంలో భారత రాజ్యాంగం విడదీయలేని భాగంగా మారిన విధానం.

రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం బలోపేతం చేసిన విధానాలు.

సామాజిక, ఆర్థిక న్యాయాన్ని పెంపొందించే దిశగా చర్యలు.

అయిదు దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన వారు రాజ్యాంగాన్ని కాలరాసిన తీరును కూడా నేను ప్రస్తావించాను.

ఒక పార్టీ విరోధ పక్ష స్థానం నుంచి అవరోధ పక్షంగా మారిన విధానాన్నీ పేర్కొన్నాను.

ఇంగ్లిష్ – nm-4.com/PxXR6o

హిందీ – nm-4.com/HbHegQ”