Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎస్ అధ్యక్షులు శ్రీ బరాక్ ఒబామా తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిన్న సాయంత్రం యుఎస్ అధ్యక్షులు శ్రీ బరాక్ ఒబామా వద్ద నుండి ఒక టెలిఫోన్ కాల్ ను అందుకొన్నారు.

ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలలోను భారతదేశానికి, యుఎస్ కు మధ్య ఉన్న సంబంధాలలో సర్వతోముఖ ప్రగతి మరియు సహకారం చెప్పుకోదగిన రీతిలో నమోదు కావడాన్ని ఇరువురు నేతలూ సమీక్షించి తృప్తిని వ్యక్తం చేశారు.

భారతదేశం మరియు యుఎస్ ల మధ్య వ్యూహాత్మక సహకారం బలోపేతం కావడానికి యుఎస్ అధ్యక్షులు శ్రీ బరాక్ ఒబామా గట్టి మద్దతును, తోడ్పాటును అందజేసినందుకుగాను ప్రధాన మంత్రి శ్రీ ఒబామాకు ధన్యవాదాలు తెలిపారు.

అధ్యక్షులు శ్రీ ఒబామా భావి ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ మోదీ తన శుభాభినందనలను అందజేశారు.

***