పిఎంఇండియా
అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం అన్వేషించడంలోను, ఉపయోగించుకోవడంలోను సహకరించుకోవడం కోసం భారతదేశానికి, వియత్ నామ్ కు మధ్య కుదిరిన ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ను మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ పై 2016 సెప్టెంబర్ 3వ తేదీన సంతకాలు జరిగాయి.
ఈ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ అంతరిక్ష శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం మరియు భూమి రిమోట్ సెన్సింగ్ సహా సంబంధిత అప్లికేషన్ లు వంటి వాటిలోను; శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు శాటిలైట్ బేస్ డ్ నావిగేషన్ లోను; అంతరిక్ష శాస్త్ర విజ్ఞానం మరియు గ్రహాల అన్వేషణ లోను; స్పేస్ క్రాఫ్ట్ , స్పేస్ సిస్టమ్స్, ఇంకా గ్రౌండ్ సిస్టమ్ మరియు స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్; అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన పరస్పర ఆసక్తియుతమైన రంగాలలో సహకరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ద్వారా వియత్ నామ్ కు అందజేసే సహకారం.. అంతరిక్ష సంబంధ సాంకేతిక విజ్ఞానాన్ని మానవాళి మేలు కోసం ఉపయోగంలోకి తీసుకురావడంలో సంయుక్త కార్యకలాపాలను చేపట్టేందుకు కూడా.. బాట పరచగలుగుతుంది.
భూగ్రహం యొక్క రిమోట్ సెన్సింగ్ రంగంలోను; శాటిలైట్ కమ్యూనికేషన్; శాటిలైట్ బేస్ డ్ నావిగేషన్; స్పేస్ సైన్స్ లలోను మరియు అంతరిక్ష అన్వేషణ రంగంలోను నూతన పరిశోధక కార్యకలాపాలను చేపట్టేందుకు, అప్లికేషన్ పాసిబిలిటీస్ కు కూడా ఈ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ఒక ఉత్తేజాన్ని అందించగలదు.