పిఎంఇండియా
రాజ్యాంగ ఏడో షెడ్యూలు లోని జాబితా-I (కేంద్ర జాబితా) మరియు జాబితా-III (ఉమ్మడి జాబితా) ల స్పెసిఫైడ్ ఎంట్రీల లోని ఎటువంటి విషయాలతోనైనా పొంతన గల గణాంకాలు కాన్ స్టిట్యూషన్ (అప్లికేషన్ టు జమ్ము & కశ్మీర్) ఆర్డర్, 1954లో భాగంగా జమ్ము & కశ్మీర్ కు వర్తించే విధంగా చూడటానికిగాను గణాంకాల సేకరణ చట్టం, 2008 అధికార పరిధిని జమ్ము & కశ్మీర్ కు కూడా విస్తరించేందుకు ఒక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి సంబంధించిన ప్రతిపాదనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ సవరణ జమ్ము & కశ్మీర్ రాష్ట్రంలో సమాచార సేకరణ యంత్రాంగాన్ని పటిష్టపరచగలుగుతుంది.
ఈ సవరణ..
(అ) కాన్ స్టిట్యూషన్ (అప్లికేషన్ టు జమ్ము & కశ్మీర్) ఆర్డర్, 1954 ప్రకారం స్టేట్ కు రిజర్వు చేయబడని విషయాలకు సంబంధించి చట్టం యొక్క అధికార పరిధిని జమ్ము & కశ్మీర్ కు కూడా విస్తరించే వెసులుబాటును కల్పిస్తుంది;
(ఆ) సమాచార సేకరణ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయపరచటానికి మరియు వ్యర్థ శ్రమ, వగైరా పనులను నివారించేందుకు ప్రభుత్వ విభాగాలకు సంప్రదింపుల అవకాశాన్ని కల్పించేందుకు కేంద్రంలో, ప్రతి రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించేందుకు వీలు కల్పిస్తుంది.
పూర్వ రంగం
ఆర్థిక సంబంధ, జనాభా సంబంధ, సాంఘిక సంబంధ, శాస్త్ర విజ్ఞాన సంబంధమైన అంశాలు, ఇంకా పర్యావరణ సంబంధమైన అంశాలపై గణాంకాల సేకరణకు వీలుగా ది కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాక్ట్, 2008 కి చట్టరూపాన్ని ఇవ్వడం జరిగింది. ఈ చట్టం అధికార పరిధి జమ్ము & కశ్మీర్ కు తప్ప మిగతా భారతదేశానికంతటికీ వర్తిస్తోంది. జమ్ము & కశ్మీర్ రాష్ట్ర విధాన సభ ది జమ్ము & కశ్మీర్ కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాక్ట్, 2010కి చట్టరూపాన్ని ఇచ్చింది. ఈ చట్టం యావత్తు జమ్ము & కశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తుంది; అంతే కాక, కేంద్ర చట్టానికి దాదాపు నకలుగా ఇది రూపొందింది. ది కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాక్ట్, 2008, ది కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాక్ట్, 2010 లు కేంద్ర జాబితా కిందకు వచ్చే స్టాటిస్టికల్ సబ్జెక్ట్ స్ కు, ఇంకా కాన్ స్టిట్యూషన్ (అప్లికేషన్ టు జమ్ము & కశ్మీర్) ఆర్డర్, 1954 ప్రకారం జమ్ము కశ్మీర్ కు వర్తించే స్టాటిస్టికల్ సబ్జెక్ట్ స్ కు వర్తించవు. ఇది శాసనపరమైన శూన్యాన్ని ఏర్పరచింది. పైపెచ్చు, జమ్ము & కశ్మీర్ కు సంబంధించినంత వరకు కేంద్రం కల్పించుకోవలసిన ఉమ్మడి అధికార పరిధికి కూడా ది కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాక్ట్, 2008 లో తావు ఇవ్వబడలేదు. ఈ శూన్యాన్ని తొలగించడం ప్రతిపాదిత సవరణ ఉద్దేశంగా ఉంది.