Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశానికి, గ్రీస్ కు మధ్య వైమానిక సేవల ఒప్పందంపై సంతకాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారతదేశానికి, గ్రీస్ కు మధ్య వైమానిక సేవల ఒప్పందం (ఎఎస్ఎ)పై సంతకాలకు ఆమోదం తెలిపింది.

పౌర విమానయాన రంగంలో ఆవిష్కారమయ్యే పరిణామాలకు అనుగుణంగా ఇరు దేశాలకు మధ్య ఇప్పటి కన్నా ఎక్కువగా వ్యాపారం, పెట్టుబడులు, పర్యటన మరియు సాంస్కృతిక ఆదాన ప్రదానాలు చోటు చేసుకొనేటట్లు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఎటువంటి అంతరాయాలకు తావు ఉండనటువంటి అనుసంధానాన్ని ఏర్పరచేందుకు, అటువంటి వాతావరణాన్ని ఇప్పటికన్నా అధికంగా ఏర్పరచేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. అంతే కాక, ఉభయ దేశాల వైమానిక సంస్థలకు వాణిజ్య సంబంధమైన అవకాశాలను అందించడంతో పాటు, మరింత భద్రతకు మరియు మరింత సురక్షకు కూడా ఇది బాట వేయగలదు.

ఎఎస్ఎ ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

అ. ఇరు దేశాలకు ఒకటి లేదా అంతకు మించిన విమాన సేవల కంపెనీని నియమించే అధికారం ఉంటుంది.

ఆ. అలా నియామకం పొందిన విమాన సేవల సంస్థకు అవతలి పక్షపు దేశంలో వైమానిక సేవల విక్రయాన్ని పెంపొందించేందుకుగాను అక్కడ కార్యాలయాలను నెలకొల్పే హక్కు ఉంటుంది.

ఇ. ఉభయ దేశాల డెజిగ్నేటెడ్ ఎయిర్ లైన్స్ నిర్దిష్ట మార్గాలలో అంగీకారం కుదిరిన మేరకు సర్వీసులను నడిపేందుకు న్యాయమైన మరియు సమాన అవకాశాలను పొందగలుగుతాయి.

ఈ. ప్రతి ఒక్క పక్షపు డెజిగ్నేటెడ్ ఎయిర్ లైన్ ఒకే పక్షానికి చెందిన, ఇతర పక్షానికి చెందిన మరియు థర్డ్ పార్టీకి చెందిన డెజిగ్నేటెడ్ క్యారియర్స్ తో సహకారాత్మకమైన మార్కెటింగ్ ఏర్పాట్లను కుదుర్చుకొనేందుకు వీలు ఉంటుంది;

ఉ. రూట్ షెడ్యూలు ప్రకారం, భారతీయ వైమానిక సంస్థలు ఏథెన్స్, థెసలోనికి, హెరాక్లియన్ లకు విమానాలను నడపవచ్చు. అంతే కాక, తరువాతి కాలంలో నిర్ణయించే మేరకు గ్రీస్ లోని మరే 3 ప్రదేశాలకైనా భారతదేశం నుండి క్యారియర్ లను నడిపేందుకు కూడా అవకాశం లభించగలదు. హెలెనిక్ గణతంత్ర విమాన సంస్థలు న్యూ ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ మరియు చెన్నై .. ఈ 6 మహానగరాలకు.. నేరు కార్యకలాపాలను జరపగలుగుతాయి. భారతదేశ డెజిగ్నేటెడ్ క్యారియర్ లతో పాటు గ్రీస్ క్యారియర్ లకు ఇమీడియట్ పాయింట్ అండ్ బియాండ్ పాయింట్ లు ఏవైనా సరే లభ్యం కాగలవు.

భారతదేశానికి, గ్రీస్ కు మధ్య ప్రస్తుతం ఎటువంటి ఎఎస్ఎ లేదు. ఇరు పక్షాల ప్రతినిధి వర్గాలు 2016 సెప్టెంబరు 6, 7 తేదీలలో న్యూ ఢిల్లీలో సమావేశమయ్యాయి. భారతదేశం, గ్రీస్ ల మధ్య గగన తల అనుసంధానాన్ని మెరుగుపరచాలన్న ధ్యేయంతో, పౌర విమానయాన రంగంలోని అత్యంత తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరియు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) యొక్క సరికొత్త నమూనాకు అనుగుణంగా ఈ ఒప్పందం రూపొందింది.

***