Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పౌర విమానయానంలో సాంకేతిక విజ్ఞాన సంబంధ సహకారం కోసం భారతదేశానికి, ఫ్రాన్స్ కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


పౌర విమానయాన రంగంలో టెక్నికల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ను అమలుపరచడానికిగాను ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ), ఫ్రాన్స్ కు చెందిన సివిల్ ఏవియేషన్ అథారిటీ (డిజిఎసి) లు ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు ను) కుదుర్చుకొనేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ సాంకేతిక సహకార కార్యక్రమం ఎఎఐ అధికారులు వారి నైపుణ్యాలను, ప్రావీణ్యాన్ని పెంపొందించుకొనేందుకు తోడ్పడుతుంది. ఈ ఎమ్ఒయు ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, మేనేజర్లు తదితరులకు శిక్షణనివ్వడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

****