పిఎంఇండియా
రాంచీ లో హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఇసి) లిమిటెడ్ కు ఉన్న భూమిలో ప్రస్తుతం ఉపయోగంలో లేని 675.43 ఎకరాల స్థలాన్ని ఝార్ ఖండ్ ప్రభుత్వానికి బదలాయించడం ద్వారా ఆ భూమిని సొమ్ము చేసుకొనేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా హెచ్ఇసి కి రూ.742.98 కోట్లు సమకూరుతాయి. ఈ డబ్బును ఉద్యోగి
సంబంధమైన బకాయిలను ఉదాహరణకు గ్రాట్యుటీ, పిఎఫ్, సెలవును నగదుగా మార్చడం, ఇంకా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఇతరత్రా పదవీవిరమణ ప్రయోజనాల అందజేతకు వినియోగించనున్నారు. ఈ సొమ్ము ప్రభుత్వానికి హెచ్ఇసి చెల్లించవలసిన బకాయిలు, బ్యాంకర్ల బకాయిలు మరియు ఇతర సత్వర అప్పులను తీర్చివేసేందుకు కూడా ఉపయోగపడనుంది.
ఈ భూమి బదలాయింపు ఝార్ ఖండ్ ప్రభుత్వానికి విశాల ప్రజా హితం కోసం చేపట్టే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు, ఇంకా రాష్ట్ర రాజధాని నగరంలో ఇతర అభివృద్ధి పథకాల సంబంధిత అవసరాలకు కూడా ఉపయోగపడనుంది.