Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని మోదీతో శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ భండార నాయకే సమావేశం

ప్రధాని మోదీతో శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ భండార నాయకే సమావేశం

ప్రధాని మోదీతో శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ భండార నాయకే సమావేశం


శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ భండార నాయకే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్లో జరుగుతున్న “సంవాద్- హిందు, బౌద్ధం మధ్య సంఘర్షణ దూరం చేయటం, పర్యావరణ స్పృహ” సదస్సులో పాల్గొనేందుకు ఆమె భారత్కు వచ్చిన ఆమె ప్రధానితో భేటీ అయ్యారు.

ఇటీవల శ్రీలంకలో జరిగిన పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా, అన్ని భాగస్వామ్యాల పక్షాల సహకారంతో విజయవంతంగా నిర్వహించి.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై ప్రధాని మోదీ.. శ్రీలంక మాజీ అధ్యక్షురాలిని అభినందించారు.

భారత-శ్రీలంక దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావటంలో చంద్రిక కుమారతుంగ చూపించిన చొరవను ప్రధాన మంత్రి అభినందించారు. శ్రీలంక లోని అన్ని వర్గాల మధ్య సయోధ్య కుదిరి.. సామాజిక సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడటంలో ఆ దేశ చట్టాల ఆధారంగా అన్ని వర్గాలకు మేలు జరగటంలో.. చంద్రిక కుమారతుంగ కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీలంకతో భారతదేశం ఎప్పటికీ సుహ్రుద్భావ వాతావరణం కొనసాగిస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య చరిత్ర, సంస్కృతి విషయంలో లోతైన సంబంధాలున్నాయని తెలిపారు. భారత-శ్రీలంక దేశాల మధ్య భవిష్యత్తులోనూ ఈ బంధం కొనసాగేందుకు ఆ దేశ ప్రధాన మంత్రి, అధ్యక్షుడితో కలిసి పనిచేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

***

MVVS/PR/ARDHA