Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అవయవ మార్పిడి సేవల రంగంలో సహకారం కోసం భారతదేశం, స్పెయిన్ ల మధ్య ఎమ్ఒయుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఆర్గన్ ట్రాన్స్ ప్లాంటేశన్ సర్వీసుల రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై స్పెయిన్ కు చెందిన ఆరోగ్యం, సామాజిక సేవలు మరియు సమానత్వ మంత్రిత్వ శాఖ లోని నేషనల్ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేశన్ కు మరియు భారతదేశానికి చెందిన ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కు మధ్య సంతకాల ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు రెండు దేశాల మధ్య ఆర్గన్ అండ్ టిష్యూ ప్రొక్యూర్ మెంట్ అండ్ ట్రాన్స్ ప్లాంటేశన్ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి మరియు
ఉత్తమమైనటువంటి అవగాహనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. దీని ద్వారా సముపార్జించే జ్ఞానం శరీరంలో అవయవాలు పనిచేయడం మానివేసిన ఆఖరు దశలో తత్ఫలితంగా బాధపడే రోగులకు అందించవలసిన సేవలను మెరుగుపరచడంలో సహాయకారి కాగలదు.

స్పెయిన్ తో త్వరలో ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న సందర్భంలో అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలయ్యే సూచనలు ఉన్నాయి.

***