Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈశాన్య ప్రాంతాలలో కేన్సర్ చికిత్స సదుపాయాల పెంపు


గువాహాటీ లోని డాక్టర్ బి. బొరువాహ్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ను అణు శక్తి విభాగం స్వాధీనపరచుకోవడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పరిపాలన నియంత్రణ బాధ్యత టాటా మెమోరియల్ సెంటర్ కు

వైద్య, పారామెడికల్ మరియు సహాయక పదవులు మొత్తం 166 రానున్నాయి

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ కింది అంశాలను ఆమోదించింది:

(i) గువాహాటి లోని డాక్టర్ బి. బొరువాహ్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ను అణు శక్తి విభాగం (డిఎఇ) స్వాధీనపరచుకోవడం; అంతే కాక ఆ సంస్థను డిఎఇ యొక్క ఎయిడెడ్ సంస్థ అయినటువంటి టాటా మెమోరియల్ సెంటర్ (టిఎమ్ సి) యొక్క పరిపాలనా నియంత్రణ కిందకు తీసుకు రావడం;

(ii) మెడికల్, పారామెడికల్, సపోర్ట్ విభాగాలలో అదనంగా 166 ఉద్యోగాలను కల్పించడం.

ఈశాన్య ప్రాంతంలో కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండటం, కేన్సర్ చికిత్స సదుపాయాలు పరిమితంగా ఉండటం మరియు పరిశోధనలను విస్తరించడం కోసం ఒక ఆసుపత్రి అవసరపడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

ఈ ఇన్ స్టిట్యూట్ ను పటిష్టపరచడం కోసం సుమారుగా 150 కోట్ల రూపాయల పునరావృత్తం కాని వ్యయం, రూ.45- 50 కోట్ల రూపాయల వార్షిక పునరావృత్త వ్యయం అవసరమవుతుందని అంచనా.

పూర్వ రంగం:

భారతదేశ ఈశాన్య ప్రాంతంలో కేన్సర్ రోగ నిర్ధారణ, చికిత్స మరియు పరిశోధనలే ధ్యేయంగా గువాహాటీ లో 1974లో బొరువాహ్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ను ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పింది. దీనిని 1986 లో అస్సామ్ ప్రభుత్వం సంస్థ ఆస్తులు మరియు అప్పులతో సహా స్వాధీనపరచుకొంది. అలాగే, సంస్థ నిర్వహణ కోసం అణు శక్తి విభాగం (డిఎఇ)తోను, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ తోను ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకొంది. ఈ ఇన్ స్టిట్యూట్ లో ప్రస్తుతం 209 పడకలు, 8 పడకలతో కూడిన ఐసియు ఉన్నాయి.

టాటా టాటా మెమోరియల్ హాస్పిటల్ డిఎఇ కింద పని చేస్తున్న ఒక ప్రధానమైన పరిశోధన సంస్థ. కేన్సర్ పరిశోధన మరియు చికిత్స ఈ సంస్థ వ్యాపకం. డిఎఇ ఆధ్వర్యంలో టిఎమ్ సి 1989 నుండి ఈ ఇన్ స్టిట్యూట్ కు ఆర్థిక, సాంకేతిక మద్దతును అందిస్తూవస్తోంది. ఈ ఇన్ స్టిట్యూట్ ను ఈశాన్య ప్రాంతంలో కేన్సర్ చికిత్స, విద్య, పరిశోధన లకు సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ గా తీర్చిదిద్దడానికిగాను డిఎఇ దీనిని స్వాధీనం చేసుకోవాలని అస్సామ్ ముఖ్యమంత్రి 2013 అక్టోబరు లో ప్రతిపాదించారు.

****