జాతీయ భద్రత దళం (ఎన్ఎస్జీ) ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో యావత్ సిబ్బందికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ధైర్యసాహసాలు, అంకిత భావం, కర్తవ్య నిర్వహణలో కచ్చితత్వానికి జాతీయ భద్రత దళం ప్రతిరూపమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఉగ్రవాదంపై నిరంతర అప్రమత్తత, ప్రజలతో పాటు కీలక జాతీయ సంపద రక్షణలో వారి ప్రతిష్టాకర సంసిద్ధత అందరిలోనూ అపార విశ్వాసం కలిగిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“జాతీయ భద్రత దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ సిబ్బందికీ నా శుభాకాంక్షలు. ధైర్యసాహసాలు, కచ్చితత్వం, అచంచల నిబద్ధతకు వారు ప్రతీకలు. ఉగ్రవాదంపై సదా అప్రమత్తత, దేశ ప్రజలతోపాటు కీలక జాతీయ సంపద పరిరక్షణలో వారి నిరంతర సంసిద్ధత మనందరికీ అపార విశ్వాసం కలిగిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
Greetings to the personnel of the National Security Guard on their Raising Day. They embody courage, precision and an unwavering commitment to duty. Their steadfast vigil against terrorism and their readiness to protect our people and vital national assets inspire immense confidence and pride. @nsgblackcats
— Narendra Modi (@narendramodi) October 16, 2026