Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కజాక్ స్తాన్ కు బయలుదేరడానికన్నా ముందు ప్రధాన మంత్రి ప్రకటన


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కజక్ స్తాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి ముందు ఈ కింది విధంగా ఒక ప్రకటనను విడుదల చేశారు.

‘‘నేను జూన్ 8, 9 తేదీ లలో రెండు రోజుల పాటు కజక్ స్తాన్ లోని అస్తానా కు వెళ్తున్నాను. అక్కడ జరుగనున్న షాంఘయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సిఒ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాను.

ఈ సమావేశంలో జరగవలసిన ప్రక్రియ ముగిసిన అనంతరం భారతదేశం ఎస్ సిఒ లో సంపూర్ణ సభ్యురాలు అవుతుంది. ఇది జరిగాక, ఎస్ సిఒ యావత్తు మానవాళిలో 40 శాతానికి పైగాను, ప్రపంచ జిడిపి లో సుమారు 20 శాతానికి ప్రాతినిధ్యం వహించగలుగుతుంది.

గత సంవత్సరం తాష్ కెంత్ లో జరిగిన ఎస్ సిఒ సమావేశంలో మేము పూర్తి స్థాయి సభ్యత్వ ప్రక్రియను మొదలుపెట్టాం. ఎస్ సిఒ తో భారతదేశ సాహచర్యానికి మరింత గాఢతను జత పరచడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇది ఇతర అంశాలతో పాటుగా ఆర్థిక అనుసంధానానికి మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు ఎదురొడ్డి నిలవడంలో ఇతోధిక సహకారానికి తోడ్పడగలదు.

ఎస్ సిఒ సభ్యత్వ దేవాలతో మనకు దీర్ఘ కాలిక సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లడం ద్వారా మన దేశాల మరియు మన ప్రజల పరస్పర ఉన్నతికి బాటలు పరచుకోవచ్చు.

మనమంతా కలిసి లాభపడే క్రమంలో కొత్త అవకాశాలను పండించుకోవచ్చు. అంతే కాక మనం మన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో ఏవైనా ఉమ్మడి సవాళ్లు ఎదురైతే ఆ సవాళ్లను పరిష్కరించుకోవడానికి మన ప్రయత్నాల్ని సైతం పెంచుకోవచ్చు.

జూన్ 9 వ తేదీ సాయంత్రం పూట, నేను ‘‘భవిష్య శక్తి’’ అనే ఇతివృత్తంతో సాగే అస్తానా ఎక్స్ పో ప్రారంభ కార్యక్రమానికి కూడా హాజరవుతాను’’.