Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ‌లంక ప్రధాన మంత్రి శ్రీ ర‌ణిల్ విక్ర‌మ సింఘేతో క‌ల‌సి సంయుక్త మీడియా స‌మావేశంలో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ మీడియా ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం

గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌ ర‌ణిల్ విక్ర‌మ సింఘే,

మీడియా ప్ర‌తినిధుల‌కు,

ప్రొఫెస‌ర్ మైత్రీ విక్ర‌మ సింఘే, ఇత‌ర ప్ర‌తినిధుల బృందానికి హృద‌య పూర్వ‌క స్వాగ‌తం ప‌లుకుతున్నాను.

గ‌త నెల‌లో జ‌రిగిన పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో యునైటెడ్ నేష‌న‌ల్ ఫ్రంట్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్సు కూట‌మిని విజ‌య‌తీరాల‌కు చేర్చిన మీకు మ‌రో మారు అభినంద‌న‌లు తెలుపుతున్నాను.

మీ తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు భార‌త్‌ను ఎంచుకోవ‌డం మాకు ఎంతో గౌర‌వంగా ఉంది. గ‌తంలో భార‌త్‌లో ఎన్డీయే ప్ర‌భుత్వం తొలిసారి కొలువు దీరిన స‌మ‌యంలోనే మీరూ శ్రీ‌లంకలో పూర్తి కాలం ప్ర‌ధానిగా ఎన్నిక కావ‌డం యాదృచ్చిక‌, ఆనంద‌క‌ర విష‌యం.

భార‌త్‌-శ్రీ‌లంక ద్వైపాక్షిక సంబంధాల‌పై మీకున్న న‌మ్మ‌కానికి, దృఢ మ‌ద్ద‌తుకు ధ‌న్య‌వాదాలు. శ్రీ‌లంక అభివృద్ధి కోసం అంకిత‌భావం, దూర‌దృష్టితో ప‌నిచేస్తున్న మీరు మాకు విలువైన స్నేహితులు.

భార‌త్‌-శ్రీ‌లంక మైత్రికి సంబంధించి ఈ ఏడాదిని ఒక చారిత్ర‌క సంవ‌త్స‌రంగానే చెప్పాలి. గ‌డ‌చిన ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌లంక అధ్య‌క్షులు సిరిసేనా తొలి విదేశీ ప‌ర్య‌ట‌నలో భాగంగా భార‌త్‌కు వ‌చ్చారు. మార్చిలో శ్రీ‌లంక‌ను సంద‌ర్శించే అద్భుత అవ‌కాశం నాకు వ‌చ్చింది. ఈరోజు శ్రీ‌లంక ప్ర‌ధాని విక్ర‌మ సింఘే మ‌న‌తో ఉన్నారు.

మార్పు కోసం, సంస్క‌ర‌ణల కోసం ఈ ఏడాది శ్రీ‌లంక రెండు సార్లు ఓటు వేసింది. శ్రీ‌లంక ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయం గురించి ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డానికి ఇంత‌కంటే ప్ర‌త్యేక‌మైన ప్ర‌క‌ట‌న ఇంకేముంటుంది. శాంతిస్థాప‌న కోసం, అభివృద్ధి కోసం, సుసంప‌న్న‌ భ‌విష్య‌త్తు దిశ‌గా శ్రీ‌లంక అడుగులు వేస్తోంద‌ని చెప్ప‌డానికి ఇదే సంకేతం.

శ్రీ‌లంక అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందాల‌నీ, అన్ని రంగాల్లోనూ గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిని సాధించాల‌నీ, ఒక పొరుగు దేశంగా, మిత్ర‌దేశంగా భార‌త్ నుంచి సంపూర్ణ స‌హ‌కారం ఉంటుందని తెలియ‌జేస్తున్నాను.

ఇటీవ‌లి కాలంలో శ్రీ‌లంక ప్ర‌భుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణ‌యాల ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాం. రాజ‌కీయ ఐక‌త్య సాధించ‌డంలో నాయ‌క‌త్వం చూపిన చొర‌వ ప్ర‌శంసించ‌ద‌గ్గ‌ది.

శ్రీ‌లంకలోని నాయ‌క‌త్వ ప‌టిమ‌, మేథో సంప‌త్తి, ప్ర‌జ‌ల్లో ఉన్న ఐక‌మ‌త్యం ఇవ‌న్నీ దేశాభివృద్ధికి ఎంత‌గానో ఉప‌క‌రిస్తాయ‌ని న‌మ్ముతున్నాను. శ్రీ‌లంక ప్ర‌జ‌ల‌తోపాటు, అక్క‌డ ఉంటున్న తమిళ సంఘాల ప్ర‌జ‌ల‌కు కూడా స‌మాన హ‌క్కులు, న్యాయం, హోదా యునైటెడ్ శ్రీ‌లంక‌లో ఉంటాయ‌ని విశ్వసిస్తున్నాను. మీ అభివృద్ధి మ‌న రెండు దేశాలతోపాటు, పశ్చిమ ఆసియా, తీర ప్రాంతాల‌కూ ముఖ్యం.

నేనూ, ప్ర‌ధాన‌మంత్రి క‌ల‌సి చాలా విష‌యాల‌పై ఈరోజు చ‌ర్చించుకున్నాం. క‌రెన్సీ స్వాప్ అగ్రిమెంట్‌తో స‌హా, ప‌లు ద్వైపాక్షిక సంబంధాల విష‌యాల్లో గుణాత్మ‌క‌మైన మార్పుల‌కు గ‌త మార్చి నుంచే స్వాగ‌తం ప‌లికాం. ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌ల‌ప‌ర‌చే ప‌లు ప్రాజెక్టుల విష‌యాల్లో మ‌రింత వేగాన్ని పెంచుతామ‌నే ఆశాభావం వ్య‌క్తం చేశాం.

ఇరు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. శ్రీ‌లంక ఆర్థిక వ్య‌వస్థ‌కు అనుగుణంగా మా వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను అభివృద్ధి చేసుకోవాల‌నుకుంటున్నాం. ఈ ల‌క్ష్యాల‌ను సాధించ‌డం కోసం అవ‌స‌ర‌మైన వాణిజ్య ఒప్పందాలూ పెట్టుబ‌డుల‌కు సంబంధించి కూడా చ‌ర్చించుకున్నాం.

భార‌తీయ పెట్టుబ‌డి దారుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌మ‌ని ఆయ‌న్ని కోరాను. అలాగే, శ్రీ‌లంక ఆర్థికాభివృద్ధిలో.. ప్ర‌త్యేకంగా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ర‌వాణా, ఇంధ‌న రంగాల్లో అభివృద్ధికి దోహ‌ద‌ప‌డేందుకు సిద్ధంగా ఉన్నాం. శ్రీ‌లంక అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన ఎలాంటి స‌హ‌కారాన్నైనా భార‌త్ చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసేందుకు సంతోషిస్తున్నాను.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, రైల్వే, ఇంధ‌నం, వ్య‌వ‌సాయం, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, అంతరిక్ష‌, పౌర అణురంగంతోపాటు వివిధ రంగాల్లో మ‌న అభివృద్ధి భాగ‌స్వామ్యం కొన‌సాగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి విక్ర‌మ సింఘే కు హామీ ఇస్తున్నాను. మ‌న స‌త్సంబంధాలు ఇలానే కొన‌సాగుతాయి.

ఇటీవ‌లే ఒక క్రికెట్ టెస్ట్ సిరీస్‌ను మ‌నం ముగించుకున్నాం. గొప్ప క్రికెటర్ కుమార సంగ‌క్క‌ర ఆట ను మ‌నం మిస్ అవుతున్నాం.

దేశ ర‌క్ష‌ణ‌కు, భ‌ద్ర‌త‌కు సంబంధించి వ్య‌వ‌హారాల్లో ఇరు దేశాలూ స‌హ‌క‌రించుకుందాం. ముఖ్యంగా ఉగ్ర‌వాదంపై పోరాటంలో, మ‌న స‌ముద్ర తీరాల్లోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో స‌హ‌కారాన్ని పెంచుకుందాం . మా డిఫెన్స్ ట్రెయినింగ్ ప్రొగ్రామ్ లో శ్రీ‌లంక కీల‌క భాగ‌స్వామి. దీనికి సంబంధించి మా స‌హ‌కారం కొన‌సాగుతూనే ఉంటుంది. ప్ర‌ధాన‌మంత్రి, నేను మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడుకున్నాం. ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఇరువైపుల మ‌త్స్య‌కారుల సంఘాల నుంచి సంప్ర‌దింపులు కొన‌సాగుతూనే ఉంటాయి. ఈ స‌మ‌స్య‌ల్ని మాన‌వ‌తా దృక్ప‌థం తో ప‌రిశీలించాల‌ని కోరాను.

భారత్-శ్రీ‌లంక రెండు దేశాలు…. ఒక‌రి అభివృద్ధిలో మ‌రొక‌రి భాగ‌స్వామ్యం ఉండాల‌ని కాంక్షిస్తున్నాను. ఈ సంబంధాలు ఇరు దేశాల్లోని సామాన్యుల హృదయాల‌ను కూడా ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌గాలి. అధ్యక్షుడు సిరిసేనా, ప్రధాని విక్రమ సింఘే ల హ‌యాంలో భవిష్యత్తు మరింత ఆశావ‌హంగా ఉంటుంద‌ని ఆశిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.