Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌

ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో ప్ర‌ధాని రౌండ్ టేబుల్‌


ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆ దేశానికి చెందిన ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. జెపి మోర్గాన్ ప్రెసిడెంట్‌, సిఇఒ, చైర్మ‌న్ జామీ డైమ‌న్‌, బ్లాక్‌స్టోన్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సిఇఒ, చైర్మ‌న్ స్టీవ్ ష్వార్జ్ మ‌న్‌, వార్‌బ‌ర్గ్ పింక‌స్ కో సిఇఒ, చార్లెస్ కాయే, కెకెఆర్ కో చైర్మ‌న్‌, కో సిఇఒ హెన్రీ క్రేవిస్‌, జ‌న‌ర‌ల్ అట్లాంటిక్ సిఇఒ బిల్ ఫోర్డ్, ఎఐజి ఇన్సూరెన్స్ సిఇఒ, ప్రెసిడెంట్ పీట‌ర్ హాంకాక్‌, టైగ‌ర్ గ్లోబ‌ల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ చేజ్ కోల్మ‌న్‌, ఎన్‌వై స్టేట్ కామ‌న్ రిటైర్మెంట్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీస‌ర్ విక్కీ ఫుల్ల‌ర్ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

భార‌త్‌లో వ్యాపార నిర్వ‌హ‌ణ తేలిక చేయ‌డానికి ప్ర‌ధాని తీసుకున్న చ‌ర్య‌ల‌ను సిఇఒలు ప్ర‌శంసించారు. అలాగే డిజిట‌ల్ ఇండియా, మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాల ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. భార‌త స్టార్ట‌ప్‌ల ప‌ట్ల ప‌లువురు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ న‌వ్య‌త ఆధారంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే స్టార్ట‌ప్‌ల‌లో ఇన్వెస్ట్ చేయ‌డానికి సంసిద్ధ‌త ప్ర‌క‌టించారు. భార‌త్‌లో పెట్టుబ‌డుల‌కు ఇప్ప‌టికీ ప‌న్నుల‌కు సంబంధించిన సంక్లిష్ట‌త‌లు, ఇప్ప‌టికీ అప‌రిష్కృతంగా ఉన్న అధికార యంత్రాంగంలోని నిర్లిప్త‌త వంటివి అవ‌రోధంగా ఉన్నాయ‌ని వారు ప్ర‌ధానికి నివేదించారు.

భార‌త్‌లో వివిధ రంగాల్లో పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను ప్ర‌ధాని వారికి వివ‌రిస్తూ త‌న “స్టార్ట‌ప్ ఇండియా, స్టాండ‌ప్ ఇండియా” విజ‌న్ గురించి వారికి స‌వివ‌రంగా తెలియ‌చేశారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల‌తో పాటు స్టార్ట‌ప్‌లకు “ప‌ర్స‌న‌ల్ సెక్టార్” పేరిట తాను ప్రోత్సాహం ఇవ్వ‌ద‌ల‌చుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. దేశంలో ఐటి విప్ల‌వానికి స్టార్ట‌ప్‌లు, న‌వ్య‌తే ప్ర‌ధాన‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఆ స‌మావేశానికి హాజ‌రైన సిఇఒలు భార‌త్‌లో అవ‌కాశాల గురించి మాట్లాడ‌డ‌మే కాకుండా భార‌త్ ప‌ట్ల త‌మ విశ్వాసాన్ని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ప్ర‌ధాని సంతృప్తి ప్ర‌క‌టించారు. అలాగే భార‌త్‌లోని విధానాల ప‌ట్ల వారు త‌మ ఆందోళ‌న‌టు కూడా తెలియ‌చేయ‌డం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం ప్ర‌క‌టించారు.

గ‌త 15 మాసాల కాలంలో భార‌త్ సాధించిన ఆర్థిక పురోగ‌తి గురించి ఆయ‌న వారికి స‌వివ‌రంగా తెలియ‌చేశారు. ప్ర‌పంచంలోని వివిధ‌ దేశాల ధోర‌ణికి భిన్నంగా గ‌త 15 మాసాల కాలంలో భార‌త‌దేశానికి ఎఫ్‌డిఐల వెల్లువ పెరిగింద‌ని ఆయ‌న చెప్పారు. భార‌త్ ప‌ట్ల విదేశీ ఇన్వెస్ట‌ర్ల విశ్వాసానికి ఇది ద‌ర్ప‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు.

మీడియా, టెక్నాల‌జీ, క‌మ్యూనికేష‌న్ల‌పై రౌండ్‌టేబుల్‌

అమెరికాకు చెందిన మీడియా, ఎంట‌ర్‌టైన్‌మెంట్ విభాగాల సిఇఒల‌తో కూడా ప్ర‌ధాని రౌండ్‌టేబుల్ నిర్వ‌హించారు. న్యూస్ కార్పొరేష‌న్ మ‌రియు ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఫాక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ పీట‌ర్ మ‌ర్దోక్‌, ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఫాక్స్ సిఇఒ జేమ్స్ మ‌ర్దోక్‌, న్యూస్ కార్ప్ సిఇఒ రాబ‌ర్ట్ థాంప్స‌న్‌, స్టార్ ఇండియా సిఇఒ ఉద‌య్ శంక‌ర్‌, డిస్క‌వ‌రీ క‌మ్యూనికేష‌న్స్ ప్రెసిడెంట్‌, సిఇఒ డేవిడ్ జ‌స్ల‌వ్‌, సోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సిఇఒ మైకేల్ లింట‌న్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఒ మైకేల్ రోత్‌, వైస్ మీడియా సిఇఒ షేన్ స్మిత్‌, డ‌బ్ల్యుపిపి సిఇఒ మార్టిన్ సారెల్‌, టైమ్ వార్న‌ర్ సిఇఒ జెప్ బ్యూక్స్, ఎ అండ్ ఇ నెట్‌వ‌ర్క్ సిఇఒ నాన్సీ డుబ్యూ, విసీ ఇండస్ర్టీస్ చైర్మ‌న్ అంథోని ప్రాట్‌, రూట్ వ‌న్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ప్ర‌తినిధి విలియం దుహ‌మెల్‌, వేల్యూ యాక్ట్ కాపిట‌ల్ సిఇఒ జెఫ్ ఉబెన్ వారిలో ఉన్నారు.

ప్ర‌ధాని క్రియాశీల‌మైన‌, చురుకైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌శంసిస్తూ మోదీ నాయ‌క‌త్వంలో భార‌త్ భ‌విష్య‌త్ ప‌ట్ల‌ సిఇఒలు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా డిజిట‌ల్ ఇండియా చొర‌వ ద్వారా భార‌త్‌లో చోటు చేసుకుంటున్న డిజిట‌ల్ విప్ల‌వం గురించి వారు అమిత ఆస‌క్తి ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో నెల‌కొన్న శ‌క్తివంత‌మైన క‌ద‌లిక వేగాన్ని మ‌రింత‌గా పెంచుతుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

టెలివిజ‌న్ డిజిటైజేష‌న్ వేగం పెంచాల‌ని, సెల్యులార్ (మొబైల్‌) మౌలిక వ‌స‌తులు మ‌రింత ప‌టిష్ఠం చేయాల‌ని వారు ప్ర‌ధానికి సూచించారు.

ఇటీవ‌ల కాలంలో టెక్నాల‌జీ, మీడియా రంగంలో వ‌స్తున్న మార్పులు మేథ‌స్సు మ‌రింత‌గా విస్త‌రించేందుకు స‌హాయ‌కారి అయిన‌ట్టు ప్ర‌ధాని, సిఇఒలు అభిప్రాయ‌ప‌డ్డారు.ప్ర‌స్తుతం ప్ర‌పంచం యావ‌త్తు టెక్నాల‌జీ ఆధారిత యుగంలో పురోగ‌మిస్తున్న‌ద‌ని, ఈ ద‌శ‌లో భౌతిక‌మైన మౌలిక వ‌స‌తుల‌తో పాటు డిజిట‌ల్ మౌలిక వ‌స‌తులు కూడా చాలా కీల‌క‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. ఆయా విభాగాల్లోని సిఇఒల‌కు భార‌త్ అతి పెద్ద అవ‌కాశ‌మే కాకుండా పెద్ద స‌వాలు కూడా అని ఆయ‌న సూచించారు. భార‌త్‌లో పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు రూపొందించే స‌మ‌యంలో ప్రాంతీయ భాష‌ల‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాల‌ని కోరారు. దేశంలోని ఆరు ల‌క్ష‌ల గ్రామాల‌ను బ్రాండ్‌బ్యాండ్ తో అనుసంధానం చేసేందుకు త‌న ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌ధాని వారికి వివ‌రించారు. సిఇఒలంద‌రూ 21వ శ‌తాబ్ది సిఇఒల‌ను వీక్షించాల‌ని, వారి విలువ‌లు, వారు ఎదుర్కొనే స‌వాళ్ళ‌ను కూడా గుర్తించాల‌ని సూచించారు. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధిలో డిజిట‌ల్ టెక్నాల‌జీ పాత్ర‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్ర‌జాస్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్ఠం చేయ‌డంలో డిజిట‌ల్ టెక్నాల‌జీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చెప్పారు.

ద్వైపాక్షిక స‌మావేశాలు:

ప్ర‌ధాని బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాతో స‌మావేశ‌మ‌య్యారు. తామిద్ద‌రూ గ‌తంలో స‌మావేశ‌మైన త‌ర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగ‌తిని వారు స‌మీక్షించారు. భూస‌రిహ‌ద్దు అంగీకారం అమ‌లులో పురోగ‌తి ప‌ట్ల వారు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క‌నెక్టివిటీ, ఇన్‌ఫ్రా, సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాలు, భ‌ద్ర‌తా మండ‌లి, ఇత‌ర అంత‌ర్జాతీయ ప్రాధాన్య సంస్థ‌ల్లో సంస్క‌ర‌ణ‌లు వంటి భిన్న అంశాల‌పై వారు చ‌ర్చించారు.

సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనాడైన్స్ ప్ర‌ధాని డాక్ట‌ర్ రాల్ఫ్ గొన్సాల్వెజ్‌తో కూడా మోదీ స‌మావేశ‌మ‌య్యారు. భ‌ద్ర‌తామండ‌లి సంస్క‌ర‌ణ‌ల‌కు ఆ దేశం ఇస్తున్న స‌హ‌కారం ప‌ట్ల ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

గుయానా ప్రెసిడెంట్ డేవిడ్ గ్రేంజ‌ర్‌తో ప్ర‌ధాని స‌మావేశ‌మయ్యారు. త‌మ దేశంలో ఐటి రంగాన్ని ప‌టిష్ఠం చేయ‌డంలో అందిస్తున్న స‌హ‌కారం ప‌ట్ల ఆయ‌న మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మైకేల్ బ్లూమ్‌బ‌ర్గ్ తో స‌మావేశం:

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మైకేల్ బ్లూమ్‌బ‌ర్గ్ తో స‌మావేశ‌మై స్మార్ట్ సిటీల ఏర్పాటుకు ఇస్తున్న మ‌ద్ద‌తును ప్ర‌శంసించారు.

సిఇఒల‌తో స‌మావేశాలు:

త‌యారీ, మౌలిక వ‌స‌తుల రంగాల‌కు చెందిన 42 మంది అమెరిక‌న్ సిఇఒల‌తో ప్ర‌ధాని చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్ర‌ధాని అభివృద్ధి ఆకాంక్ష‌లు, గ‌త 15 నెల‌ల్లో సాధించిన పురోగ‌తిని సిఇఒలు ప్ర‌శంసించారు.

ఎవ‌రికీ ఎలాంటి అనూహ్య‌మైన విఘాతాల‌కు తావు లేని, పార‌ద‌ర్శ‌క‌మైన‌, జ‌వాబుదారీత‌నం గ‌ల పాల‌న అందించేందుకు తాను కృషి చేస్తున్న‌ట్టు ప్ర‌ధాని వారికి వివ‌రించారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీ కార్య‌క్ర‌మాల‌కు సిఇఒలు
త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు.