Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాఠ‌శాల‌, ఉన్న‌త విద్య కోసం కాల‌ ప‌రిమితి ముగిసిపోని మూల నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


మరియు ఆర్ధిక స‌హాయ చ‌ట్టం, 2007 సెక్ష‌న్ 136 కింద మాద్య‌మిక‌, ఉన్న‌త విద్య‌కోసం పన్ను వ‌సూలు చేస్తార‌నే విష‌యం తెలిసింది. దీని ద్వారా వ‌చ్చే నిధుల‌తో మాధ్యమిక‌, ఉన్న‌త విద్య‌ కోసం కాల‌ ప‌రిమితి లేని మూల నిధి ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ప‌బ్లిక్ అకౌంట్ లోని కాల‌ ప‌రిమితి ముగిసిపోని విభాగంలో దీనిని ఏర్పాటు చేస్తారు. ఈ అకౌంట్ ను ‘‘మాధ్య‌మిక్ అండ్ ఉచ్చ్ త‌ర్ శిక్షా కోశ్ ( ఎంయుఎస్ కె) అంటారు. మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్యా ప‌న్ను కింద వ‌సూలు చేసే ప‌న్ను వ‌సూళ్లను ఈ అకౌంట్ లో జ‌మ‌ చేస్తారు.

ఎంయుఎస్ కె కింద జ‌మ అయ్యే నిధుల‌ను విద్యారంగం లోని ప‌థ‌కాల అమ‌లు కోసం ఖ‌ర్చు చేస్తారు. త‌ద్వారా దేశ‌ వ్యాప్తంగా మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థుల‌కు ల‌బ్ధి చేకూరుతుంది.

పైన తెలియ‌జేసిన నిధికి సంబంధించి.. కింద తెలిపిన అంశాల‌కు కూడా కేంద్ర‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

(i) కాల‌ ప‌రిమితి ముగిసిపోనటువంటి నిధుల ప‌బ్లిక్ అకౌంట్ విభాగాన్ని మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌ శాఖ నిర్వ‌హిస్తుంది.

(ii) ప్ర‌స్తుతం మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్యారంగంలో కొన‌సాగుతున్న ప‌థ‌కాల‌ కోసం ఈ ప‌న్ను వ‌సూలు ద్వారా స‌మ‌కూరే నిధుల‌ను వినియోగిస్తారు. అంతే కాదు మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌ కోసం భ‌విష్య‌త్ లో చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ కోసం కూడా కేంద్ర మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి శాఖ నిధుల‌ను కేటాయిస్తుంది. అయితే అవ‌స‌రాలు, నియ‌మ‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ కేటాయింపు వుంటుంది.

(iii) పాఠ‌శాల విద్య‌, ఉన్న‌త విద్యా విభాగాలలో అమ‌లు చేసే ప‌థ‌కాల‌కు ఏ ఆర్ధిక సంవ‌త్స‌రంలోనైనా చేసే ఖ‌ర్చును మొద‌ట ఆ సంవ‌త్స‌రంలో కేటాయించిన మొత్తం బ‌డ్జెట్ నిధుల‌ నుండే ఖ‌ర్చు పెట్టాలి. ఏడాది మొత్తం బ‌డ్జెట్ నిధులు అయిపోయిన త‌రువాత మాత్ర‌మే ఎంయుఎస్ కె నుండి నిధుల‌ను ఖ‌ర్చు చేయవలసివుంటుంది.

(iv) దేశ పబ్లిక్ అకౌంట్స్ విభాగం లోని వ‌డ్డీ ర‌హిత రిజ‌ర్వ్ ఫండ్ కింద ఎంయుఎస్ కెను నిర్వ‌హిస్తారు.

మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్యారంగాల‌కు త‌గిన‌న్ని వ‌న‌రులను అందుబాటులో ఉంచ‌డం ద్వారా ఈ రంగాల‌కు ప్ర‌ధాన‌మైన ల‌బ్ధి చేకూరుతుంది. నిధులు ఖ‌ర్చు కాక‌పోతే ఆర్ధిక సంవ‌త్స‌రం అంతమైన త‌రువాత అవి త‌దుపరి సంవత్సరానికి జ‌మ‌ అవుతాయి త‌ప్ప అవి కాల‌ ప‌రిమితి కింద‌కు రావు.

ముఖ్య‌మైన అంశాలు:

1. కాల‌ ప‌రిమితి ముగిసిపోని నిధి ద్వారా జ‌మ‌ అయ్యే నిధుల‌ను దేశంలోని మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్యారంగాల విస్త‌ర‌ణ‌కు ఉప‌యోగిస్తారు.

2. మాధ్య‌మిక విద్య‌ కోసం : ప‌న్ను (సెస్‌) ద్వారా స‌మ‌కూరే నిధుల‌ను ప్ర‌స్తుతం కేంద్ర మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి శాఖ ఏఏ ప‌థ‌కాల‌కు ఉప‌యోగిస్తున్న‌దో చూద్దాం.

 రాష్ట్రీయ మాధ్య‌మిక్ శిక్షా అభియాన్ ప‌థ‌కం ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. దీనికి ఇంకా ఇత‌ర ఆమోదిత ప‌థ‌కాల‌ కోసం ఈ నిధులు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

 జాతీయ స్థాయిల మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్ షిప్ కోసం ఉప‌యోగిస్తున్నారు.

 మాధ్య‌మిక విద్య‌ను అభ్య‌సించే బాలిక‌ల‌కు ప్రోత్సాహ‌కాలివ్వ‌డానికి ఉద్దేశించిన జాతీయ ప‌థ‌కానికి ఉప‌యోగిస్తున్నారు.

3. ఉన్న‌త విద్య‌ కోసం: ప‌న్ను వ‌సూలు ద్వారా స‌మ‌కూరే నిధుల‌ను కింది ప‌థ‌కాల‌కు ఉప‌యోగిస్తున్నారు.

 క‌ళాశాల‌, విశ్వ‌విద్యాల‌య
విద్యార్థుల‌కు ఉపకార వేతనాల కోసం ఖ‌ర్చు చేస్తున్నారు. గ్యారంటీ నిధుల‌ కోసం, వ‌డ్డీ రాయితీల‌ కోసం ఉద్దేశించిన ప‌థ‌కాల‌ కోసం ఉప‌యోగిస్తున్నారు.

 రాష్ట్రీయ ఉచ్చ్ త‌ర్ శిక్షా అభియాన్ కోసం

 సంస్థ‌ల‌కు ఇచ్చే బ్లాక్ స్థాయి గ్రాంటుల‌కు సంబంధించిన స్కాల‌ర్ షిప్పుల‌కు, జాతీయ‌స్థాయిలో ఉపాధ్యాయుల శిక్ష‌ణ కోసం ఉద్దేశించిన కార్య‌క్ర‌మానికి ఉప‌యోగిస్తున్నారు.
అంతే కాదు మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌కోసం చేప‌ట్ట‌బోయే ఏవైనా కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌కోసం కూడా కేంద్ర మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి శాఖ నిధుల‌ను కేటాయిస్తుంది.

 అయితే అవ‌స‌రాలు, నియ‌మ‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ కేటాయింపు ఉంటుంది.

మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌ కోసం విధించే ప‌న్ను ఉద్దేశం మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌కోసం త‌గిన‌న్ని వ‌న‌రుల‌ను ఏర్పాటు చేయడానికే. ప్రారంభిక్ శిక్షా కోశ్ (పిఎస్ కె) కింద ప్ర‌స్తుతం చేసుకున్న ఏర్పాట్ల ప్ర‌కారం నిధిని నిర్వ‌హిస్తారు. ప‌న్ను కింద వ‌సూలు అయ్యే సొమ్మును పాఠ‌శాల విద్య‌, అక్ష‌రాస్య‌త విభాగం కింద అమ‌ల‌య్యే స‌ర్వ‌శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ ఎ), మ‌ధ్యాహ్న భోజ‌న( ఎండిఎమ్) ప‌థ‌కాల‌కు ఉప‌యోగిస్తారు.

పూర్వరంగం:

(i) 1-4-2014 నుండి అమ‌ల‌య్యే విధంగా ప‌దో ప్ర‌ణాళిక‌లో అన్ని కేంద్ర ప‌న్నుల్లో రెండు శాతం విద్యా ప‌న్ను ఉండేలా నిబంధ‌న విధించారు. ప్ర‌స్తుతం ఉన్న బ‌డ్జెట్ నిధుల‌కు తోడుగా ఈ రెండు శాతం ప‌న్ను ద్వారా వ‌చ్చే నిధుల‌ను ఉప‌యోగించి ప్రాథమిక విద్య‌ కోసం కావ‌లసిన అద‌న‌పు వ‌న‌రులను స‌మ‌కూర్చాల‌నేది దీని ఉద్దేశం. మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్యారంగాలలో కూడా ఇలాంటి ప్రోత్సాహాన్నే ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. త‌ద్వారా అంద‌రికీ మాధ్య‌మిక విద్య ల‌భించేలా చూడాల‌ని ఉన్న‌త విద్య‌ను విస్త‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే 2007 బ‌డ్జెట్ ఉప‌న్యాసంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి 1 శాతం అద‌న‌పు విద్యాప‌న్నును ప్ర‌తిపాదించారు. కేంద్ర ప‌న్నుల్లో ఉండే 1 శాతం ప‌న్ను ద్వారా వచ్చే నిధుల‌ను మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌ల కోసం వినియోగించాల‌ని ఆయ‌న అన్నారు.

(ii) కేంద్ర ప‌న్నులలో ఉండే 1 శాతం పన్ను మాధ్య‌మిక‌, ఉన్న‌త‌విద్యా ప‌న్ను అంటారు. దీనిని ఆర్ధిక స‌హాయ చ‌ట్టం, 2007 సెక్ష‌న్ 136 ప్ర‌కారం విధిస్తారు. మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌ ల కోసం ఆర్ధిక వ‌న‌రులను స‌మ‌కూర్చాల‌నే ప్ర‌భుత్వ సంక‌ల్పాన్ని నెర‌వేర్చ‌డానికి ఈ ప‌న్నును విధించ‌డం జ‌రిగింది.

(iii) మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి శాఖ 2010 జులై నెల‌లో డ్రాఫ్ట్ కేబినెట్ నోట్ ను విడుద‌ల చేసింది. ఇందులో మాధ్య‌మిక్ అండ్ ఉచ్ఛ్ త‌ర్ శిక్షా కోశ్ ( ఎంయుఎస్ కె) పేరు మీద కాల‌ ప‌రిమితి ముగిసిపోనటువంటి నిధుల‌ కోసం ప‌బ్లిక్ అకౌంట్ ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదించింది. మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్యా ప‌న్ను కింద వ‌సూల‌య్యే డ‌బ్బుల‌ను ఇందులో జ‌మ చేయాల‌ని సూచించింది. ఈ విష‌యంలో త‌మ అభిప్రాయాల‌ను చెప్పాల‌ని సంబంధిత మంత్రిత్వ‌ శాఖ‌ల‌ను అడిగింది. ప్రణాళికా సంఘం, ఈశాన్య ప్రాంతాల మంత్రిత్వ‌ శాఖ‌, ఆర్ధిక వ్య‌వ‌హారాల విభాగం, ఆర్ధిక శాఖలను త‌మ అభిప్రాయాల‌ను చెప్పవలసిందిగా కోరింది. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆర్ధిక వ్య‌వ‌హారాల విభాగం ఒప్పుకోలేదు. మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్యా రంగాల ప‌థ‌కాల‌ కోసం చేసే బ‌డ్జెట్ కేటాయింపులు 1 శాతం ప‌న్ను ద్వారా స‌మీక‌రించే నిధుల‌ కన్నా చాలా ఎక్కువ‌గా ఉంటున్నాయ‌నే కార‌ణంగా ఒప్పుకోలేదు. దాంతో ప‌న్ను ద్వారా వ‌సూలు చేసే మొత్తాన్ని ఆయా ఆర్ధిక సంవ‌త్స‌రాలలో మాధ్యమిక‌, ఉన్న‌త విద్య‌ కోసం పూర్తిగా కేటాయిస్తూ వ‌చ్చారు. దాంతో గ‌త ఏడాది 1 శాతం ప‌న్ను ద్వారా వ‌సూలైన నిధుల‌ను ఈ ఏడాది కేటాయించ‌డానికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.

(iv) త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొని, 2016 ఫిబ్ర‌వ‌రి 11న కేంద్ర మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి శాఖ ‘‘మాధ్య‌మిక్ అండ్ ఉచ్ఛ్ త‌ర్ శిక్షా కోశ్’’ ను ఏర్పాటు చేయాల‌నే అంశాన్ని తిరిగి ప‌రిశీలించాల‌ని ఆర్ధిక వ్య‌వ‌హారాల విభాగాన్ని కోరింది. ఆర్ధిక వ్య‌వ‌హారాల విభాగం 2016 జూన్ నెల‌ 20న స్పందించి, దీనికి ఆమోదం తెలిపింది. ఎంయుఎస్ కెను ఏర్పాటు చేయ‌డానికి వీలుగా మంత్రివర్గ ఆమోదాన్ని పొందాల‌ని, అందుకోసం డ్రాఫ్ట్ కేబినెట్ నోట్ ను రూపొందించాల‌ని మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు సూచన చేసింది.