పిఎంఇండియా
చైనా ప్రజా గణతంత్రం అధ్యక్షులు పంపిన ఆహ్వానాన్ని అందుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017, సెప్టెంబర్ 3-5 తేదీల మధ్య బిఆర్ఐసిఎస్ 9వ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం కోసం చైనా లోని ఫుజియాన్ ప్రావిన్స్ లో శియామెన్ ను సందర్శించనున్నారు.
మయన్మార్ అధ్యక్షుడు యు తిన్ క్యావ్ ఆహ్వానంపై, తదనంతరం 2017, సెప్టెంబర్ 5-7 తేదీల మధ్య ప్రధాన మంత్రి మయన్మార్ లో పర్యటించనున్నారు. ఇది ప్రధాన మంత్రి శ్రీ మోదీ మయన్మార్ లో జరిపే ఒకటో ద్వైపాక్షిక ఆధికారిక పర్యటన కానుంది. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై స్టేట్ కౌన్సెలర్ డా ఆంగ్ సాన్ సూ క్యీ తో చర్చలు జరుపుతారు. అలాగే, అధ్యక్షుడు యు తిన్ క్యావ్ తో కూడా ఆయన భేటీ అవుతారు. రాజధాని నగరం నే పై తా లో తన కార్యక్రమాలను ముగించుకోవడంతో పాటు, ఆయన యాంగాన్ మరియు బాగాన్ లలోనూ పర్యటిస్తారు.
***