Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బగాన్ లో భూకంప ప్రభావానికి లోనైన పగోడాల పరిరక్ష‌ణ కోసం మయన్మార్ తో ఎమ్ఒయుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


మయన్మార్ లోని బగాన్ లో భూకంప ప్రభావిత పగోడాల పరిరక్ష‌ణ కోసం భారతదేశం మరియు మయన్మార్ ల మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) ను కుదుర్చుకొనేందుకు ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్యక్ష‌తన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ 2017 సెప్టెంబర్ 6-7 తేదీలలో మయన్మార్ పర్యటించే సందర్భంగా ఈ ఎమ్ఒయు పై సంతకాలు జరుగుతాయి.

సాంస్కృతికపరంగాను, మతపరంగాను మయన్మార్ తో భారతదేశం కొనసాగిస్తూ వస్తున్న సంబంధాలను ఈ పథకం యొక్క అమలు మరింతగా పటిష్టపరచ గలదు. అంతేకాకుండా ఈ పథకంతో ముడిపడి ఉన్నటువంటి మతపరమైన మరియు పర్యటన సంబంధమైన ప్రాముఖ్యం కారణంగా మయన్మార్ ప్రజల దృష్టిలో భారతదేశం పట్ల గొప్ప సౌహార్దం కూడా పెంపొందగలదు. మయన్మార్ తో భారతదేశం ఏర్పరచుకొన్న వికాస శీల భాగస్వామ్యానికి ఈ పథకం తన వంతు తోడ్పాటును సైతం అందిచగలుగుతుంది. మయన్మార్ లో ప్రధానమైన పర్యాటక ఆకర్షణను కలిగివున్న దర్శనీయ క్ష‌ేత్రాలలో బగాన్ ఒకటి. కట్టడాల పరిరక్ష‌ణలో, పునరుద్ధరణలో భారతదేశానికి ఉన్న సిద్ధహస్తతను ఒక్క మయన్మార్ ప్రజలకే కాకుండా ఇతర దేశాలకు చెందిన యాత్రికులకు కూడా రుజువు చేసేందుకు ఇది ఒక అవకాశంగా పరిణమించగలదు.

***