Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబ‌యి లో తొక్కిస‌లాట ఘ‌ట‌న పై సంతాపం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


ముంబ‌యి లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ప్రాణ న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘ముంబ‌యి లో తొక్కిస‌లాట కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారంద‌రికీ ఇదే నా ప్ర‌గాఢ సంతాపం. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను.

ముంబ‌యిలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతోంది. రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్ ముంబ‌యి లో ఉండి ప‌రిస్థితిని ప‌రిశీలిస్తూ, అన్ని విధాల స‌హాయం అందేట‌ట్లు శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.