Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌పాన్ ప్ర‌ధాని ప‌ద‌వికి మ‌ళ్ళీ ఎన్నికైన శ్రీ శింజో ఆబే ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


జపాన్ లో ఆదివారం జరిగిన ఆకస్మిక ఎన్నిక‌ల‌లో ప్ర‌ధాని ప‌ద‌వికి శ్రీ శింజో ఆబే తిరిగి ఎన్నికైన సందర్భంగా ఆయ‌న‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

‘‘నా ప్రియ‌ మిత్రుడు శ్రీ శింజో ఆబే ఎన్నిక‌ల‌లో ఘ‌న విజ‌యం సాధించినందుకు హృద‌య‌పూర్వక శుభాకాంక్ష‌లు. ఆయ‌న‌తో క‌ల‌సి భార‌త‌దేశం- జ‌పాన్ సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయడం కోసం కృషిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.