Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ జయంతి: ఢిల్లీలోని విజ్ఙాన్‌ భవన్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ అభినందన వేడుకకు హాజరు కానున్న ప్రధాని


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం ముంబై వెళ్లనున్న ప్రధాని.

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం జరగనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ అభినందన వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. భారతరత్న లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత పధ్రానమంత్రి చైతన్య భూమిని సందర్శించి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు నివాళులు అ ర్పిస్తారు. ఇందుమిల్స్‌ ప్రాంగణంలో నిర్మించే అంబేడ్కర్‌ స్మారకానికి శంకుస్థాపన చేసి శి లాఫలకాన్ని ఆ విష్కరిస్తారు.

జవహర్లాల్‌ నెహ్రూ పోర్ట్‌లో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి, రెండు మెట్రో కారిడార్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ముంబైలోని బాంద్రా-కుర్లా ప్రాంగణంలోని ఎంఎంఆర్‌డీఏ మైదానంలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.