పిఎంఇండియా
ఢిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌లో ఈ నెల 15వ తేదీన(అక్టోబరు 15, 2015) జరగనున్న దివంగత రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి వేడుకలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
ఆ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ” ఏ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్ కలామ్స్ లైఫ్ ” పేరిట ఏర్పాటు చేయనున్న ఫొటో ప్రదర్శనను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం డీఆర్ డీవో భవన్‌లోని కొథారీ ఆడిటోరియంలో జరిగే సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
Glad to join Dr. Kalam's birth anniversary celebrations, which includes unveiling of his statue & photo exhibition. http://t.co/feCjKE66uK
— Narendra Modi (@narendramodi) October 13, 2015