పిఎంఇండియా
అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ యోధుల సంస్మరణ అనే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విధినిర్వహణలో ఉంటూ తమ ప్రాణాలను త్యాగం చేసిన సీఆర్‌పీఎఫ్ పోలీసు వీరుల సంస్మరణార్థం రూపొందించిందీ పుస్తకం. 2014లో డీజీపీల వార్షిక సదస్సులో మాట్లాడినప్పుడు- ప్రతి పోలీసు దళం కూడా తమ వీరుల త్యాగాలను నిక్షిప్తం చేయాలని, తద్వారా అవి భావి తరాలకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ఈ పుస్తకం ప్రతులను దేశంలోని తమ అమరవీరుల కుటుంబాలకు సీఆర్‌పీఎఫ్ అందజేస్తుంది.