పిఎంఇండియా
ఐ క్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐ క్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మానవీయ సేవలో ఐ క్యరాజ్యసమితి 70 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రపంచాన్ని శాంతియుత స్థానంగా మార్చే తన లక్ష్య సాధనకు అది కట్టుబడి ఉంది.
ఐ క్యరాజ్య సమితి చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భారత్ అగ్ర భాగాన ఉంది. ఐరాస చేసే ప్రయత్నాలకు తన శక్తి మేరకు మద్దతు అందించడానికి భారత్ కట్టుబడి ఉంది.
ఐ క్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ప్రఖ్యాత భవనాలన్నింటినీ ఈ రోజు రాత్రి విద్యుత్ దీప కాంతులతో అలంకరిస్తారు. భారత్‌లో అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఈ సందర్భంగా మేం విద్యుత్ వెలుగులతో అలంకరించబోతున్నాం.
మహాత్మాగాంధీ చూపిన మార్గం, అందించిన ఆదర్శాలు నేటి ప్రపంచానికి ఎంతగానో వర్తిస్తాయి. ఐఝ్యరాజ్యసమితి చార్టర్, ఆదర్శాల్లో కూడా ఇవి ప్రతిఫలిస్తాయి. అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Greetings to everyone on @UN Day. UN completes 70 years in service of humanity, committed to its goal of making the world a peaceful place.
— Narendra Modi (@narendramodi) October 24, 2015
India is at the forefront of various initiatives of the @UN & is committed to doing our best in supporting UN in their endeavours.
— Narendra Modi (@narendramodi) October 24, 2015
On @UN day iconic buildings worldwide will be illuminated in blue at night. In India, Sabarmati Ashram in Ahmedabad will be illuminated.
— Narendra Modi (@narendramodi) October 24, 2015
The ideals & path shown by Gandhi ji are extremely relevant today & they resonate with the @UN charter & ideals of the UN.
— Narendra Modi (@narendramodi) October 24, 2015