పిఎంఇండియా
ప్రధాని ప్రారంభోపన్యాసం
మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీలో కొందరికి గతంలోనే భారత్‌ను సందర్శించే అవకాశం వచ్చి ఉండొచ్చు. కొందరికి భారత్ రావడం ఇదే మొదటిసారి కావొచ్చు. ఏది ఏమైనా, మీరందరికీ ఇక్కడా సౌకర్యంగా ఉందని భావిస్తున్నాను. ఇది అధికారికమైన కార్యక్రమమే. అయితే, దీనికి అదనంగా మీరు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారో, చూడాలనుకుంటున్నారో సూచనలు ఇవ్వొచ్చు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తాం. భారత్-ఆఫ్రికా ఫోరం సమ్మిట్‌లో భాగంగా మీరు రావడం చాలా ముఖ్యమైనప్పటికీ, భారత్‌లో పర్యటించడం చాలా చాలా విశేషం. మీ కోసం మా ప్రభుత్వం తగిన ఏర్పాట్లన్నీ చేస్తుంది.
నా అభిప్రాయం ప్రకారం, భారత్-ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అనేక కోణాలు చాలా ప్రధానమైనది. ఇక, ఆతిథ్య దేశంగా భారత్‌కు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 54 ఆఫ్రికా దేశాలకు కూడా మరెంతో ముఖ్యమైనది. 54 దేశాల ప్రతినిధులను ఆహ్వానించగా, అన్ని దేశాల వారు భాగస్వామ్యం వహించడం విశేషం. అంటే, భారత్-ఆఫ్రికా ఫోరం సమ్మిట్ ఈ తరహా సదస్సుల్లో చాలా పెద్దదన్నట్లుగానే లెక్క.
హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్థాయిలో 40 దేశాల ప్రతినిధులు వస్తున్నట్లు మాకు సమాచారం అందింది. మిగిలిన దేశాల నుంచి సీనియర్ మంత్రులు హాజరవుతున్నారు. ఈసారి, ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సుతోపాటు, ఇక్కడే వాణిజ్య మంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే, రాబోయే రోజుల్లో భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడాలన్నది మన లక్ష్యం.
గతంలో భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సులు 2008లో ఒకసారి, 2011లో ఒకసారి… రెండు పర్యాయాలు జరిగాయి. ఇప్పుడు నిర్వహిస్తున్నది మూడో సదస్సు. గతంలో జరిగిన రెండు సదస్సులు ‘బాంజుల్ ఫార్ములా’ ప్రాతిపదికన జరిగాయి. పైగా, అప్పట్లో చాలా పరిమిత సంఖ్యలో దేశాలు భాగస్వామ్యం వహించాయి. ఈసారి… ‘ఫార్ములా’ల నుంచి బయటికి వచ్చి, విస్తృత స్థాయిలో ఆఫ్రికా దేశాలన్నింటి భాగస్వామ్యం ఉండేలా నిర్వహించాలని భావించాం.
ఈ చర్యల ద్వారా భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చవచ్చునని భావిస్తున్నాను. అంతేకాదు, ఈ భాగస్వామ్యంలో మన అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుందని భావిస్తున్నాను. ఇది మావైపు నుంచి మేం తీసుకున్న చొరవ. తద్వారా, గతంలో జరిగిన రెండు సదస్సులకంటే భిన్నంగా ఇది జరుగుతుందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా వివిధ స్థాయుల్లో, ఉన్నత స్థాయిలో సమావేశాలు జరుగుతాయి. ఈ భాగస్వామ్యంతో కొత్తదనం ఆఫ్రికాలోని నలుదిశలకూ విస్తరిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ ‘కొత్తదనం’ ఆఫ్రికాకు మాత్రమే కాదు, భారత్‌కు… మన సంబంధాల్లోనూ వస్తుందని భావిస్తున్నాను.
మీరు భారత్‌లో వారం రోజులపాటు ఉంటారని, మిమ్మల్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళతారని, ఇక్కడ పురోగతి, అభివృద్ధిని పరిశీలిస్తారని అధికారులు నాకు వివరించారు. మీరు మాత్రమే కాకుండా… ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ఆఫ్రికా నుంచి ఏకంగా 400 మంది పాత్రికేయులు కూడా వస్తున్నారు. అది కూడా వారి సొంత ఏర్పాట్లతోనే. ఈ ఒక్క విషయంతో మన సదస్సుకు ఉన్న ప్రాధాన్యాన్ని అర్థమవుతుంది. ఈ సదస్సు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని నాకు అవగతమవుతోంది. ప్రజలు దీనిని ఎంతో ప్రాధాన్యమున్న కార్యక్రమంగా చూస్తున్నారు. ఇది ఒక శుభసూచకం.
ఆఫ్రికాతో భారత్‌కు సంబంధాలు కేవలం ఆర్థిక, రాజకీయపరమైనవి మాత్రమే కాదు! మన మధ్య బలమైన సంస్కృతీ సంప్రదాయాల బంధం ఉంది. భూమిపై ఉన్న రెండు భూభాగాలు లక్షల సంవత్సరాల క్రితం ఒకటిగానే ఉండేవని, అవి తర్వాత విడిపోయాయని… ఒకటి ఆసియాగా, మరొకటి ఆఫ్రికాగా మారాయని చెబుతారు. మనల్ని ఒక సముద్రం విభజిస్తోంది. భారత పశ్చిమ తీరం, ఆఫ్రికా తీర్పు తీరాన్ని ఈ సముద్రం అనుసంధానిస్తోంది.
నేను భారత్‌లో పశ్చిమ తీరంలో ఉన్న గుజరాత్ ప్రాంతం నుంచి వచ్చాను. నిజానికి, ఆఫ్రికాతో వాణిజ్యం, నౌకా సంబంధాలను తొట్ట తొలుత ఏర్పాటు చేసుకున్నది గుజరాతీలే. ఇప్పటికే, 2,70,000 మంది భారతీయులు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది గుజరాతీలే. ఇంకా చెప్పాలంటే, స్వయంగా నాకు కూడా ఆఫ్రికాతో సంబంధాలున్నాయి, అదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అంతకుముందు కూడా! ఆఫ్రికాకు చెందిన అనేక మంది ప్రముఖులతో నాకు సంబంధాలుండేవి. ఇలా వ్యక్తిగతంగా చూసినా, ఆఫ్రికాతో నాకు సన్నిహిత సంబంధం ఉన్నట్లే.
భారత్, ఆఫ్రికాల మధ్య అనేక సారూప్యతలున్నాయి. భారత్, ఆఫ్రికా కలిసి ప్రపంచంలోని మూడో వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇక.. భారత జనాభా మొత్తం ఆఫ్రికా ఖండంలోని జనాభాతో సమానం. ఆఫ్రికా ఖండం ఈ ప్రపంచానికి సరికొత్తగా ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ కూడా ‘యంగెస్ట్’ దేశమే. ప్రస్తుతం మనం ప్రపంచాన్ని పరిశీలిస్తే, జనాభాలో 65 శాతానికంటే ఎక్కువమంది 35 సంవత్సరాలలోపు వయసున్న రెండు ప్రాంతాలు మనవి మాత్రమే. ఇది భారత్, ఆఫ్రికాలకు ఒక పెద్ద అవకాశం, అదృష్టమని నేను భావిస్తున్నాను.
భారత్, ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం శరవేగంగా పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలలోనే ఇది 9 నుంచి పది రెట్లు పెరిగింది. ఈ సదస్సు తర్వాత ఇందులో మరింత వృద్ధి చోటు చేసుకుంటుందని భావిస్తున్నాను. ఆఫ్రికాలో పెట్టుబడులు పెడుతున్న ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. మరీ ముఖ్యంగా చమురు రంగంలో పెట్టుబడులు ఆఫ్రికా ఆర్థిక రంగానికి సరికొత్త చోదక శక్తిని అందిస్తున్నాయి.
గతంలో జరిగిన రెండు భారత-ఆఫ్రికా ఫోరం సదస్సుల నేపథ్యంలో… ఆఫ్రికాలో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్తు, నీరు తదితర రంగాల్లో అభివృద్ధి కోసం భారత్ 740 కోట్ల డాలర్ల రాయితీ రుణాన్ని భారత్ అందించింది. ప్రస్తుతం 40కి పైగా దేశాల్లో వందకు మించి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.
అదేవిధంగా ఆఫ్రికాలోని వందకుపైగా సంస్థల్లో భారత్ 120 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. తద్వారా ఆఫ్రికాలో మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతోంది. మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్య పెంపులో ఆఫ్రికా, భారత్ మధ్య భాగస్వామ్యం ఎంతో సంతోషకరమైన విషయం. గత కొద్ది సంవత్సరాల్లో సుమారు 25 వేల మంది ఆఫ్రికా విద్యార్థులకు విద్య, శిక్షణ అందించే అవకాశం మాకు లభించింది. ఇది, భారత్‌కు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఆఫ్రికాలో పలుకీలక స్థానాల్లో ఉన్న నాయకుల్లో అత్యధికులు భారత్‌లో చదువుకుని, శిక్షణ పొందిన వారే కావడం విశేషం.
ఆఫ్రికాలోని చాలా దేశాలతో భారత్‌ను కలిపే మరో అంశం… సౌర విద్యుత్తు. దీని ద్వారా ఆఫ్రికాలోనే అనేక దేశాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుతం వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించడంపై ప్రపంచం పోరాడుతోంది. ఈ క్రమంలో సౌర విద్యుత్తు అంశం ఆఫ్రికా దేశాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నాను. వాతావరణ మార్పు సమస్యలను పరిష్కరించడంలో మనం ప్రధాన పాత్ర పోషించనున్నాం.
ప్రస్తుతం ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే… పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న భారత్, ఆఫ్రికాల సంస్కృతీ సంప్రదాయాలు మనకెంతో గర్వకారణం. తద్వారా, గ్లోబల్ వార్మింగ్ పాపంలో మన వాటా అతి తక్కువని చెప్పవచ్చు. భారత్, ఆఫ్రికాల మధ్య ఇదొక ఉమ్మడి భాగస్వామ్య లక్షణం.
ఈ సదస్సుతోపాటు, వచ్చే సదస్సు భారత్, ఆఫ్రికా మధ్య బంధాలను, ఆత్మ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా జరుగుతాయని నేను ఆకాంక్షిస్తున్నాను. మన మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలోపేతం, విస్తృతమవుతాయి. మనం కలిసి ఈ ప్రపంచానికి ఎంతో చేయగలమన్న నమ్మకం నాకుంది.
మీ అందరికి మరోసారి హార్ధిక స్వాగతం పలుకుతున్నాను. సదస్సు సందర్భంగా మరోసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. థ్యాంక్యూ!
ఇండియన్-ఆఫ్రికా ఫోరం మూడో సదస్సు సందర్భంగా ఆఫ్రికా పాత్రికేయులు, సంపాదకుల ప్రశ్నలకు ప్రధాని మోదీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలు…
ప్రశ్న: సామాజిక-ఆర్థిక, రాజకీయాల పరంగా భారత్‌కు ఆఫ్రికా వ్యూహాత్మక ప్రాధాన్యం ఏమిటి? ఆఫ్రికాతో భారత్ సంబంధాలు కేవలం చైనాను దృష్టిలో పెట్టుకుని చేసుకుంటున్నవేనా?
సమాధానం: భారత, ఆఫ్రికా మధ్య పరస్పర విశ్వాసం, బలమైన సంబంధానికి ఈ సదస్సులో అన్ని ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొంటుండటం, అందులో 40 దేశాల అధిపతులే స్వయంగా వస్తుండటమే నిదర్శనం.
ఈ సంబంధం వ్యూహాత్మక అంశాలకు అతీతమైనది. ఇది భావోద్వేగమైన బంధం. ఇది మన ఇద్దరి ఆసక్తికరమైన చరిత్రలోనే మొదలైంది. వాణిజ్యం, సంస్కృతిలో మన మధ్య శతాబ్దాలుగా బంధాలున్నాయి. మన ఇద్దరం వలసపాలన కష్టాలను అనుభవించాం. సమానత్వం, గౌరవం, న్యాయం కోసం మనం పోరాడాం. అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్నాం. ప్రపంచానికి మన స్వరం వినిపిస్తున్నాం. సుదృఢమైన విశ్వాసం, పరస్పర నమ్మకంతో మనకు లభించిన వరాలు.
భారత్, ఆఫ్రికా కలిసి ప్రపంచంలోని మూడోవంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో అత్యధికులు యువతే. ప్రపంచంలోని మొత్తం యువతలో, ఈ శతాబ్దిలో భారత్, ఆఫ్రికా యువత భాగస్వామ్యమే ఎక్కువ. ప్రపంచ గతిని నిర్దేశించడంలో వీరి భవిష్యత్తు కీలకంగా మారనుంది.
మొత్తం ప్రపంచ ఆర్థిక రంగానికి భారత్, ఆఫ్రికా ఆకర్షణీయంగా మారాయి. ప్రస్తుతం భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఆఫ్రికా కూడా వేగవంతమైన పురోగతిని నమోదు చేస్తోంది. భారత్, ఆఫ్రికా కలిసి తమ ప్రజల కోసం ఎంతో చేయవచ్చు. సుసంపన్నం కావొచ్చు. మన ఇద్దరి భాగస్వామ్యం ఇద్దరినీ బలోపేతం చేసే శక్తిగా మారుతుంది. పరస్పర ఆర్థికాభివృద్ధితోపాటు సమానత్వ, సుస్థిర ప్రపంచాన్ని నిర్మించే దిశగా కీలకం అవుతుంది. మనవి ఇద్దరికీ పరస్పరం ఉపయోగపడే మార్కెట్లు, వనరులు. మానవ వనరులు మన ప్రధాన శక్తి. మనం ‘గ్లోబల్ విజన్’ను ఉమ్మడిగా పంచుకుంటున్నాం.
ఆఫ్రికాతో భాగస్వామ్యం పట్ల భారత వైఖరి… సాధికారత, సామర్థ్యం పెంపు, మానవ వనరుల అభివృద్ధి, భారత మార్కెట్లకు అందుబాటులో ఉండటం, ఆఫ్రికాలో భారత పెట్టుబడులకు మద్దతు అనే లక్ష్యాలతో ఉంది. తద్వారా ఆఫ్రికా ప్రజలు తమ ఖండం అభివృద్ధి కోసం బాధ్యతను పంచుకుంటూ, తమకు ఇష్టపైన ఎంపిక చేసుకునే అవకాశమూ లభిస్తుంది. ఆఫ్రికాతో మా సంబంధం అనేది అద్వితీయమైనది. మరొకరితో దీనికి పోలిక, సంబంధం లేదు.
ప్రశ్న: ఆఫ్రికా ఖండం అభివృద్ధికి భారత్, ఆఫ్రికా మధ్య సంబంధాలు ఎలా దోహద పడ్డాయి? ఇది రెండు ప్రాంతాలకూ మేలు చేసేలాగానే జరిగిందా?
సమాధానం: ఇటీవలి కాలంలో ఆఫ్రికా అభివృద్ధి అభినందనీయంగా ఉంది. ఇది ఆఫ్రికా విజన్, నాయకత్వం, శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న కృషి, ఆర్థికాభివృద్ధికి అందిస్తున్న మద్దతు ఫలితమే. సుస్థిర అభివృద్ధి, ప్రజల సాధికారత విషయంలో ఎన్నో స్ఫూర్తిదాయక విజయగాథలు ఆఫ్రికాలో వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా… మహిళలు, యువతకు సంబంధించి!
34 ఆఫ్రికా దేశాలు ఇప్పుడు 125 కోట్ల జనాభా ఉన్న భారత్ మార్కెట్‌ను సుంకాలు లేకుండానే ఉపయోగించుకోగలుగుతున్నాయి. గత రెండు భారత-ఆఫ్రికా ఫోరం సదస్సుల్లో, మేం 740 కోట్ల రాయితీ రుణాన్ని అందించేందుకు అంగీకరించాం. ఇది ఆఫ్రికాలో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి, ప్రజా సేవలు, స్వచ్ఛ ఇంధనం తదితర రంగాల్లో అభివృద్ధికి ఉపయోగపడుతోంది. దీంతోపాటు 120 కోట్ల గ్రాంట్ సహాయాన్ని కూడా అందిస్తున్నాం. తద్వారా ఆఫ్రికాలో మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణానికి అవసరమైన వంద సంస్థల ఏర్పాటుకు ఆర్థికంగా సహకరిస్తున్నాం. గత మూడేళ్లలోనే, 25వేల మంది ఆఫ్రికన్లు భారత్‌లో విద్యను అభ్యసించడమో, శిక్షణ పొందడమో జరిగింది. 48 ఆఫ్రికా దేశాలను అనుసంధానిస్తున్న ప్యాన్ ఆఫ్రికా ఈ-నెట్‌వర్క్ మానవ అభివృద్ధికి, ప్రాంతాల మధ్య సంధానానికి కొత్త హైవేగా మారింది. ఆఫ్రికాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో ప్రధానమైన దేశం… భారత్. ఆఫ్రికాకు విచ్చేస్తున్న
భారత పర్యాటకుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
ఇక… ఆఫ్రికా అభివృద్ధి చెందడమనేది భారత్‌కు అతి పెద్ద అవకాశం. చమురు వంటి ఆఫ్రికా వనరులు… భారత ఆర్థికాభివృద్ధికి దోహదపడితే, ఆఫ్రికాలో ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. సంపదను సృష్టిస్తుంది. ఆఫ్రికా ఖండం పురోభివృద్ధి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థాకు ఊపు తెస్తుంది, ఈ క్రమంలో భారత్‌కూ మేలు జరుగుతుంది.
ప్రశ్న: వలస వాదం, నయా వలసవాదం శాంతికి ఆటంకంగా మారుతున్నాయన్నది కొందరి విశ్లేషణ. భారత్ కూడా ఇలాంటి చారిత్రక నేపథ్యాన్ని అనుభవించింది. తీవ్రమైన ఘర్షణ, పోరాటంతో ఆ సంకెళ్లను ఛేదించి… సుస్థిర పాలనపై దృష్టి సారించింది. ఈ క్రమంలో భారత్ నుంచి ఆఫ్రికా ఎలాంటి పాఠాలు నేర్చుకోగలదు?
సమాధానం: భారత స్వాతంత్య్ర సముపార్జన అనేది ఆఫ్రికాలో వలసపాలన వ్యతిరేకత, స్వాతంత్య్ర పోరాటంపై బలమైన సానుకూల ప్రభావం చూపించింది. ఆఫ్రికా దేశాల స్వాతంత్య్రం కోసం, వర్ణ వివక్ష అంతం కోసం భారత్ గట్టిగా నిలబడిందని గర్వంగా చెప్పగలం.
నిజానికి… భారత్ నుంచి ఆఫ్రికాకు ఎలాంటి పాఠాలూ అక్కర్లేదు. వలసవాద పాలన మనందరిపై తీవ్రమైన ప్రభావం రూపింది. ఆఫ్రికా కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇప్పుడు అభినందనీయమైన పురోగతి కనబరుస్తోంది. ఆఫ్రికా ఖండం మరింత సుస్థిరంగా మారింది. ఆఫ్రికా దేశాలు అభివృద్ధి, శాంతి, భద్రతల బాధ్యతను ఉమ్మడిగా స్వీకరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఆఫ్రికన్లు తమ ఓటు హక్కును విస్తృత స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. ఆర్థిక సంస్కరణలు, ప్రాంతీయ ఆర్థిక సహకారం, సమగ్రతను చూస్తున్నాం. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం 95 శాతం ఆఫ్రికాలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. విద్య, ఆవిష్కరణలు, మహిళా సాధికారత, నైపుణ్య నిర్మాణం, ప్రకృతి పరిరక్షణ దిశగా ప్రశంసనీయమైన కృషి జరుగుతోంది. ఇక, అభివృద్ధితోపాటు వచ్చే అనేక సవాళ్లను సహజంగానే ఆఫ్రికా ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం, తీవ్రవాదంవంటి కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సమస్య ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఉంది. ఆఫ్రికాకు అపరిమితమైన సహజ వనరులున్నాయి. ఘనమైన చరిత్ర ఉంది. నిపుణులైన యువత పెద్ద సంఖ్యలో ఉంది. ఆఫ్రికా నాయకత్వంపై నాకు పూర్తిస్థాయి నమ్మకం ఉంది. ‘అజెండా 2063: ఆఫ్రికా వియ్ వాంట్’ అనే లక్ష్యాన్ని చేరుకుంటారనే విశ్వాసం ఉంది.
ఆఫ్రికా దేశాలకు భాగస్వామిగా, అండగా ఉంటూ, అనుభవాలను, నైపుణ్యాన్ని, వనరులను పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంటుంది. ఆఫ్రికన్లు ఆశించిన కోణాల్లో మేం సహకరిస్తాం. ఆఫ్రికా ఎదుర్కొంటున్న సమస్యల్లో అనేకం మేమూ ఎదుర్కొంటున్నాం. మేం కనుగొనే పరిష్కారాలు ఆఫ్రికాకు కూడా ఉపయోగపడతాయి.
ప్రశ్న: మరింత ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా లబ్ధి పొందడానికి భారత్, ఆఫ్రికా ఏం చేయగలవు? 2008లో జరిగిన మొట్టమొదటి భారత-ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సదస్సు తర్వాత ఈ రంగంలో సాధించిన పురోగతి ఏమిటి?
సమాధానం: భారత్, ఆఫ్రికా మధ్య పెట్టుబడులు, వాణిజ్యానికి అపార అ వకాశాలున్నాయి. ఈ శతాబ్దంలో భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశం, ఆఫ్రికా అత్యధిక జనాభా కలిగిన ఖండం. రెండు చోట్లా యువ జనం ఎ క్కువ. ఆఫ్రికాలో అపారమైన సహజ వనరులూ ఉన్నాయి. అందువల్ల భారత్, ఆఫ్రికా రెండింటిలో మరింత వేగంగా అభివృద్ధి, ఆధునికీకరణ, పట్టణీకరణ జరుగుతాయి.
మా ఆర్థిక భాగస్వామ్యం వేగం పుంజుకుంటోంది. 2007-08 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికాతో 30 బిలియన్ అ మెరికా డాలర్లు ఉన్న భారత వాణిజ్యం, 2014-15 నాటికి రెట్టింపు కంటే పెరిగి 72 బిలియన్ అ మెరికా డాలర్లకు చేరింది. భారత్, ఆఫ్రికాల్లో ఆర్థిక వృద్ధితో పాటు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలను భారత మార్కెట్లలోకి సుంకం లేకుండా అనుమతించాలని 2008లో తొలి భారత-ఆఫ్రికా సదస్సు సందర్భంగా మా దేశం తీసుకున్న నిర్ణయం కూడా వాణిజ్య అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది. ఈ నిర్ణయంతో 34 ఆఫ్రికా దేశాలు నేరుగా లబ్ధిపొందుతున్నాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి భారత్, ఆఫ్రికాలో ప్రధాన పెట్టుబడిదారుగా అ వతరించింది. ఈ విషయంలో చైనాను కూడా దాటిపోయింది.
ఆఫ్రికాకు మేం అందజేస్తున్న రుణం మొదటి రెండు ఐఏఎఫ్‌ఎస్‌లలో స్థూలంగా 7.4 బిలియన్ డాలర్లదాకా ఉంటుంది. ఇది ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల కల్పనకు, ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధికి ఉపయోగపడుతోంది. అ లాగే ఆఫ్రికాలోని ఆపారమైన వనరులు, అందుబాటులో ఉన్న వి శాలమైన మంచి వ్యవసాయ భూమి, ఆఫ్రికా సౌభాగ్యానికే కాదు, వేగంగా పెరుగుతున్న భారత్ అ వసరాలను తీర్చడానికి కూడా ప్రధాన వనరుగా మారింది.
ఆఫ్రికాలో మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం పెంచుకోవడంపై భారత్ దృష్టిపెట్టింది. దీనివల్ల ఆఫ్రికాలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, చిన్న తరహా పరిశ్రమలు, తదితర రంగాల్లో నైపుణ్యాలు, సామర్థ్యాల పెంపునకు వీలవుతుంది. ఇది భారత్‌కు, ఇతర దేశాలకు ఎ గుమతులను విస్తృతం చేస్తుంది.
ఆఫ్రికా దేశాల మార్కెట్లను సమీకృతం చేయడానికి ఆఫ్రికా చేస్తున్న ప్రయత్నాలను నేను ప్రశంసిస్తున్నాను. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడానికి ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
21వ శతాబ్దపు అ వకాశాల రంగంలో భారత్, ఆఫ్రికా కొత్త భాగస్వాములుగా అ వతరించాయి. అందువల్ల భారత్, ఆఫ్రికా ఫోరం మూడో శిఖరాగ్ర సదస్సు కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మన ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడం, అంతర్జాతీయంగా మరింత సానుకూల ఆర్థిక, వ్యవస్థాగత విధానాలను రూపకల్పన చేసుకోవడం ఎ లా అనే అంశాలపై నేను ఆఫ్రికా నాయకులతో చర్చించబోతున్నాను.
ప్రశ్న: బ్రిక్స్ దేశాలు 2015 జూలైలో స్థాపించిన కొత్త అభివృద్ధి బ్యాంకు ఆఫ్రికా దేశాలకు ఎ లాంటి ప్ర యోజనం కలిగించనుంది?
సమాధానం: ఇదొక ముఖ్యమైన పరిణామం. దీని ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మేం గట్టి ముద్ర వేయగలుగుతాం. ఐదు బ్రిక్స్ దేశాలు సమ భాగస్వాములుగా చేతులు కలిపి ఈ బ్యాంకును ఏర్పాటు చేశాయి. ఇటువంటి ఆర్థిక సంస్థల ఏర్పాటులో ఇప్పటిదాకా ఉన్న విధానాలకు ఇది పూర్తిగా భిన్నమైనది. అంతేకాదు; ఈ బ్యాంకు రుణ వితరణ విధానాలను కూడా, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను, ఇప్పటిదాకా అవి ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకునే రూపొందించడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూడా దీంతో కొత్త అ వకాశం ఏ ర్పడుతుంది. బ్యాంకు దృష్టి కేంద్రీకరించే ప్రాంతాల్లో ఆఫ్రికా ప్రధానంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మున్ముందు ఈ బ్యాంకులో ప్రత్యేకంగా ఆఫ్రికా విండో లేదా ప్రాంతీయ ప్రాతినిధ్యం ఉంటుందని నేను నమ్ముతున్నాను.
ప్రశ్న: ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు వ్యవసాయం, తత్సంబంధిత కార్యకలాపాలే ప్రధానమైనవి. భారత్‌లో కూడా మెజారిటీ ప్రజలకు ఇదే జీవనాధారం. సుస్థిర వ్యవసాయ, విధానాలు, సేద్యాభివృద్ధి సాధించడంలో ఆఫ్రికాకు భారత్ ఎ లా సాయపడుతుంది?
సమాధానం: ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 60 శాతం ఆఫ్రికాలోనే ఉంది. కానీ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాని వాటా 10 శాతం మాత్రమే. ఆఫ్రికాలో వ్యవసాయ రంగం అభివృద్ధి ఆ ప్రాంతపు ఆర్థిక, ఉపాధి, ఆహార భద్రత అ వకాశాలను మెరుగుపరచడమే కాదు; మొత్తం ప్రపంచానికే ఆఫ్రికాను ఆహారోత్పత్తి కేంద్రం (ఫుడ్ బౌ లఫ)గా చేస్తుంది. ఇటీవలి కాలంలో ఆఫ్రికా సాధిస్తున్న విజయాలు, ఆఫ్రికా వ్యవసాయ రంగం భవిష్యత్తుపై మాకు వి శ్వాసాన్ని కలగజేస్తున్నాయి.
గత కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయం, పాల ఉత్పత్తి రంగాల్లో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఈ రంగాల్లో ముందున్న అంతర్జాతీయ ఉత్పత్తిదారుల్లో భారత్ కూడా ఒ కటి. తక్కువ వ్యయంతో, జీవ వైవిధ్య పరిస్థితులకు అనుగుణంగా చేసే సాగు ద్వారా భారత్ ఈ విజయాన్ని సాధించగలిగింది. ఆఫ్రికాకు ఈ విధానాలు ఎంతో ఉపయుక్తం. నిజానికి 1960 నుంచే ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో భారత్‌కు చెందిన వ్యవసాయ నిపుణులు పనిచేస్తున్నారు. భారత్‌లో వ్యవసాయ సంబంధ విద్యా, శిక్షణా కోర్సులకు ఇచ్చే ఉపకార వేతనాల గురించి ఆఫ్రికా వాసులకు చాలా బాగా తెలుసు. ఆఫ్రికాతో మా అభివృద్ధి భాగస్వామ్యంలో వ్యవసాయం ప్రాధాన్య అంశంగా ఉంటుంది. ఆఫ్రికాలో మానవ వనరుల అభివృద్ధి, వ్యవసాయ సంబంధ శిక్షణ సంస్థల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ విధానాల బదిలీ వంటి అనేకం ఇందులో ఉంటాయి. మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం కనుక, ఈ రంగాల్లో ఆఫ్రికాతో కలసి పనిచేయడాన్ని మేం కొనసాగిస్తాం. అదే సమయంలో వాతావరణ మార్పులపై పెద్దగా దుష్ప్రభావం చూపని పర్యావరణ హిత వ్యవసాయం, తదితర ప్రస్తుత సవాళ్లను కూడా మనం ఎదుర్కొనాల్సి ఉంది. వ్యవసాయ అనంతర, దిగుబడుల ప్రాసెసింగ్, సరఫరా విధానాలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఈ విషయంలో ఆఫ్రికా దేశాల ప్రాథమ్యాలను తెలుసుకోవడానికి కూడా నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను.
ప్రశ్న: భారత, ఆఫ్రికా మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెట్టుబడులు, వాణిజ్యం స్థాయిని దాటి
టెక్నాలజీ బదిలీ, సాంకేతిక పరిజ్ఞాన పంపిణీ, సామర్థ్య నిర్మాణాల దశకు చేరుకుంది. రాబోయే సంవత్సరాల్లో భారత్ నుంచి ఇంకా ఏం ఆశించవచ్చు?
సమాధానం: భారత్, ఆఫ్రికా ఆర్థిక భాగస్వామ్యం, కేవలం లావాదేవీలకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది మన ఉ మ్మడి లక్ష్య సాఽధనపై ఆధారపడిన నమ్మకానికి సంబంధించినది. మన ప్రజల జీవితాలను మెరుగు పరచడానికి పరస్పరం సహకరించుకోవాలనే శక్తిమంతమైన ఆలోచనకు సంబంధించినది.
ఆఫ్రికాలోని తన మిత్రుల అ వసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగానే భారత్ ఎల్లప్పుడూ పనిచేస్తుంది. అదే సమయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం సృష్టించిన అ వకాశాలను, ఉపయోగించుకునేందుకు, వాతావరణ మార్పుల వంటి సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు మేం కలసి పని చేయాల్సి ఉంది. భవిష్యత్తుకు సంబంధించి మా ప్రణాళిక సంయుక్త దార్శనికత, ఉ మ్మడి లక్ష్యాలు, మన బలాలు, సామర్థ్యాలను తప్పక ప్రతిబింబిస్తుంది.
మానవ వనరుల అభివృద్ధి, సంస్థల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ హిత ఇంధనం, వ్యవసాయం, ఆ రోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాలపై మన ప్రాధాన్యం కొనసాగుతూనే ఉండాలి. అదే సమయంలో వాతావరణ మార్పులు, సముద్ర సంబంధ ఆర్థిక వ్యవస్థలో సుస్థిర అభివృద్ధికి సంబంధించి కూడా మనం కలసి పనిచేయాలి.
మన భాగస్వామ్యాన్ని రాబోయే సంవత్సరాల్లో మేం తప్పక మరింత ముందుకు తీసుకువెళ్తాం. ఆఫ్రికాతో అభివృద్ధి కార్యక్రమాన్ని సమగ్రంగా సమీక్షించుకోవడం ద్వారా మన భాగస్వామ్యాన్ని మేం మరింత ప్రభావవంతంగా మారుస్తాం. ముఖ్యంగా ఆఫ్రికా భాగస్వాములతో చర్చల ద్వారా సామర్థ్యాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు మద్దతు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మొదలైనవి సాధిస్తాం.
ప్రశ్న: ఐ క్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం కావాలన్న ఆకాంక్ష ద్వారా, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక స్వరూపాన్ని సంస్కరించడానికి భారత్ కట్టుబడి ఉందా?
సమాధానం: సమకాలీన చరిత్రలో ఎన్నడూ లేని అ రుదైన రీతిలో నేడు ప్రపంచం రాజకీయంగా, ఆర్థికంగా, సాంకేతికంగా పరివర్తనకు లోనవుతోంది. ఐ క్య రాజ్య సమితి ఆవిర్భావం నాటి కంటే ఇప్పుడు అందులో నాలుగు రెట్లు ఎ క్కువగా సభ్యదేశాలున్నాయి. అభివృద్ధి కోసం ఆ శలు, ఆ కాంక్షలు ఇప్పుడు మరింత విస్తృతమయ్యాయి. ప్రపంచ శక్తి మరింతగా విభజితమైంది. ఇప్పుడు మనం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చేస్తున్న డిజిటల్ అనుసంధాన ప్రపంచంలో నివసిస్తున్నాం. శాంతి భద్రతలకు స వాళ్లు మరింత సంక్లిష్టంగా, అనూహ్యంగా, అనిర్వచనీయంగా మారిపోయాయి. అనేకరకాలుగా మన జీవితాలు ప్రాపంచికం (గ్లోబలైజ్) అ వుతున్నాయి. అదే సమయంలో మన ఉనికి చుట్టూ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అ వకాశాలకు, భయాలకు, సవాళ్లకు ఉగ్రవాదం, సైబర్ రంగం, అంతరిక్షం సరికొత్త వేదికలుగా మారాయి. వాతావరణ మార్పులు ప్రపంచానికే సవాలుగా మారాయి. కొత్త తరహా పట్టణీకరణ కారణంగా తలెత్తుతున్న సవాళ్లు వర్ధమాన ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి.
ప్రపంచ వ్యవస్థ, అంతర్జాతీయ సంస్థలు, అభిప్రాయాలు ఇప్పటికీ రెండో ప్రపంచయుద్ధం చివరినాటి పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నాయి. ఈ సంస్థలు మనకు మంచి సేవలే అందించాయి. కానీ కొత్త యుగంలోనూ ప్రభావవంతంగా ఉండాలంటే, వాటిని ఇప్పటి శకానికి అనుగుణంగా తప్పక సంస్కరించాలి. అంతర్జాతీయ సంస్థలు, విధానాలు అ లా మారకపోతే అవి అసంబద్ధమై పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రపంచం విభజితమైపోతుంది. దీనివల్ల మన ఈ యుగంలో ఎదురయ్యే కొత్త సవాళ్లను, మార్పులను సంఘటితంగా ఎదుర్కోగలిగిన మన శక్తి సన్నగిల్లుతుంది.
అందుకే అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, భద్రతా సంస్థలను సంస్కరించాలని భారత్ సూచిస్తోంది. అవి మరింత ప్రజస్వామికంగా, సంపూరకంగా, ప్రాతినిధ్యపూరితంగా మారరాలి. ప్రపంచంలో ఆ రోవంతు జనాభాకు నెలవైన అతి పెద్ద ప్రజాస్వామిక దేశం వాణినిగానీ, ఆఫ్రికా స్వరాన్నిగానీ వినిపించగలిగే లక్షణం కలిగిన సంస్థ ఈ రోజు ఏదీ లేదు. అందుకే మేం ఐ క్యరాజ్యసమితి భద్రతా మండలిని, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంస్కరించాలని కోరుతున్నాం. ప్రపంచంలోని మూడో వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, ఆఫ్రికాలు ఈ సంస్కరణల కోసం కలసికౄట్టుగా, ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూనే ఉండాలి.
ప్రశ్న: భారత్, ఆఫ్రికా మధ్య సహకారానికి సంబంధించి శిఖరాగ్ర సదస్సు (ఐఏఎఫ్‌ఎస్-3) ఎ లాంటి ఫలితాన్ని అందించబోతోంది?
సమాధానం: భాగస్వామ్య స్ఫూర్తిని మరింత దృఢ పరచుకోవడం, మా అంతర్జాతీయ సంఘీభావాన్ని బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని విస్తృతం చేసుకోవడం మా లక్ష్యాలు. ఎజెండా-2063 డాక్యుమెంట్‌కు దాదాపు సమానంగా ఆఫ్రికా తనకోసం రచించుకున్న విజన్‌ను నేను పరిశీలించాను. మా ఇద్దరి అభివృద్ధి లక్ష్యాలు, అంతర్జాతీయ ఆకాంక్షలు, దాదాపు ఒ కేలా ఉన్నాయని దీన్ని బట్టి నేను నమ్ముతున్నాను. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ్యానికి ఇదే పునాదిగా ఉంటుంది.
ఢిల్లీలో జరిగే భారత్, ఆఫ్రికా ఫోరం మూడో శిఖరాగ్ర సదస్సు, మన అభివృద్ధి భాగస్వామ్యానికి మరింత సుస్థిరమైన, అధికమైన, ఆ శావహమైన లక్ష్యాలను నిర్దేశిస్తుందని మేం నమ్ముతున్నాం. గత దశాబ్ద కాలంగా లభించిన అనుభవాల ఆధారంగా దీన్ని మరింత ప్రభావ శీలంగా చేయాలని కూడా మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో మాదిరిగానే, మా ప్రథమ లక్ష్యం ఒ క్కటే. అభివృద్ధి సాధనలో మరింత వేగం కోసం మా ఆఫ్రికా భాగస్వాములు సొంతంగా చేసుకునే ప్రయత్నాలకు పూర్తిగా మద్దతివ్వడం. అదే సమయంలో మన కాలంలో తలెత్తుతున్న ఆహారం, ఆ రోగ్యం, పర్యావరణ భద్రత వంటి కొత్త కీలక సవాళ్లను మనం పరిష్కరించాల్సి ఉంది. మన రెండు దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహాన్నిపెంచే, వాణిజ్యానికి ఊపందించే పరిస్థితులను మేం కల్పిస్తాం. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి మేం కలసి పని చేస్తాం. సముద్ర సంబంధ ఆర్థిక వ్యవస్థ వంటి కొత్త రంగాల్లో సుస్థిర అభివృద్ధికి మేం అ వకాశాలు అన్వేషిస్తాం. మన జీవన నాణ్యతను పెంచుకునే క్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శక్తిని వాడుకోవడం, రోదసీ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, అనుసంధాన ప్రపంచాన్ని నిర్మించుకోవడం లక్ష్యంగా మేం చొరవ చూపుతాం. ఇది వన్‌వే రహదారి కాదు. అనేక రంగాల్లో ఆఫ్రికా సాధించిన అనేక విజయాల నుంచి మేం కూడా నేర్చుకుంటాం.
అంతర్జాతీయ వేదికపై మేం మా భాగస్వామాన్ని పునః పటిష్ఠం చేసుకుంటాం. ఉగ్రవాదాన్ని నిరోధించేలా భద్రతా, నౌకాయాన భద్రతా సహకారాన్ని మరింత దృఢ పరచుకుంటాం.
మొట్టమొదటి సారిగా ఆఫ్రికా దేశాలన్నీ పాల్గొంటున్న ఈ మూడో శిఖరాగ్ర సదస్సు, భారత్ ఆఫ్రికా భాగస్వామ్య బంధంలో కొత్త శకానికి నాంది అ వుతుంది.
Exchanged views on India-Africa relations with African journalists attending 3rd India Africa Editors Forum. pic.twitter.com/4KJoIYAuEW
— Narendra Modi (@narendramodi) October 23, 2015
Am told over 400 media persons from Africa are coming for @indiafrica2015. This indicates the vitality of the Summit & optimism towards it.
— Narendra Modi (@narendramodi) October 23, 2015
Am hopeful on achieving stronger economic ties between India & Africa. Also hopeful for deeper cooperation in energy, HRD & other areas.
— Narendra Modi (@narendramodi) October 23, 2015