పిఎంఇండియా
కస్టమ్స్ అంశాలకు సంబంధించి పరస్పర సహకారం, పాలనాపరమైన సహాయానికి సంబంధించి భారత్, జోర్డాన్‌ల మద్య ఒప్పందంపై సంతకాలు, ధృవీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కస్టమ్స్ నేరాల నిరోధం, దర్యాప్తునకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి తోడ్పడేందుకు ఈ ఒప్పందం సహాయపడుతుంది. ఈ ఒప్పందం వాణిజ్యానికి వీలు కల్పించడంతోపాటు, ఇరు దేశాల మధ్య సరకుల వాణిజ్యానికి సమర్ధవంతంగా క్లియరెన్సులు ఇవ్వడానికి దోహదపడుతుంది.
నేపథ్యం :
ఈ ఒప్పందం ఉభయ దేశాల కస్టమ్స్ అధికారుల మధ్య సమాచారాన్ని, నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించే లీగల్‌ఫ్రేమ్ వర్క్‌ను ఈ ఒప్పందం సమకూరుస్తుంది. అలాగే కస్టమ్స్ చట్టాలను సక్రమంగా అమలు చేయడం, కస్టమ్స్ నేరాల అదుపు, కస్టమ్స్ కేసుల దర్యాప్తుతోపాటు చట్టబద్ధమైన వాణిజ్యానికి ఇది వీలు కల్పిస్తుంది.
ముసాయిదా ఒప్పందాన్ని ఇరు దేశాల కస్టమ్స్ పాలనాయంత్రాంగాల అంగీకారంతో ఖరారు చేయడం జరిగింది.
ముసాయిదా ఒప్పందం, భారతదేశ కస్టమ్స్ అవసరాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటోంది. ప్రధానంగా రెండు దేశాల వాణిజ్యానికి కారణమైన సరకు మూలం ఎక్కడ, కస్టమ్స్ విలువ, టారిఫ్ వర్గీకరణ వంటి వాటికి సంబంధించిన సమాచార వాస్తవికతకు సంబంధించిన అంశాలను ఈ ముసాయిదా ఒప్పందం పరిగణనలోకి తీసుకుంటుంది.