పిఎంఇండియా
మహారాజ్ జోర్డాన్ నరేశ్ జనాబ్ అబ్దుల్లా ఈబ్ న్ అల్ హుస్సేన్ గారు,
శ్రేష్ఠులు,
ఇక్కడకు హాజరైన ధార్మిక విద్వాన్ లు, అగ్ర నాయకులు,
మాననీయ అతిథులారా,
ఎంపిక చేసిన భారతదేశపు కొద్ది మంది ధార్మిక విద్వాన్ లు మరియు నాయకులతో కూడిన ఈ సందోహం మధ్యకు జోర్డాన్ రాజు ఈ రోజు తరలి రావడం నాకు ఎంతో సంతోషంగాను, గర్వంగాను ఉంది.
శ్రేష్ఠులైన మీ గురించి ఎంతో కొంత చెప్పడం అనేది మాటలకు అందనిది. ఇస్లామ్ యొక్క సిసలైన గుర్తింపు ను ఆవిష్కరించే క్రమంలో మీరు పోషించిన మహత్వపూర్ణమైన పాత్రను గురించి కూడా మాటలలో వ్యక్తీకరించలేం; దానిని కేవలం అనుభూతించగలం, అంతే.
కొద్ది సేపటి కిందట చర్చ జరిగిన హిజ్ హైనెస్, రాకుమారులు శ్రీ ఘాజీ యొక్క పుస్తకం సైతం జోర్డాన్ లో మీ నాయకత్వాన జరిగినటువంటి ప్రయత్నాల ఫలితమే అని చెప్పాలి.
ఇస్లామును గురించి అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాసను కలిగివున్న వారికి ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ పుస్తకాన్ని ప్రపంచం అంతటా యువజనులు చదువుతారని నేను పూర్తి ఆశాభావంతో ఉన్నాను.
ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ నేను చేసిన అభ్యర్థనను మీరు ఎంత సులభంగా, ఎంత సరళంగా, ఎంత నిరాడంబరంగా మన్నించారో ఆ తీరు భారతదేశం అన్నా, భారతీయులన్నా మీకు ఉన్నటువంటి ఆప్యాయతను సుస్పష్టంగా వెల్లడి చేస్తోంది.
యువర్ మెజెస్టీ,
మీ దేశం జోర్డాన్ మాకొక మిత్ర దేశం. ఇతిహాస పుస్తకాలలోను, ధార్మిక గ్రంథాలలోను జోర్డాన్ యొక్క పేరు ఎన్నటికీ చెరిగిపోదు.
జోర్డాన్ ఎటువంటి పవిత్రమైన భూమి మీద నెలకొందంటే అక్కడి నుండి దైవం యొక్క సందేశం ప్రవక్తల యొక్క మరియు పునీతుల యొక్క వాణి లాగా మారి, ప్రపంచం అంతటా మారు మోగింది.
యువర్ మెజెస్టీ,
మీరు స్వయంగా విద్వాంసులు. భారతదేశాన్ని గురించిన పరిచయం ఎంతగానో ఉన్న వారు. ప్రపంచం లోని ప్రధాన మతాలు భారతదేశం యొక్క మట్టిలో పుట్టి పెరిగినవే. ఇక్కడి నీటిలో నేలలో అవి ప్రాణం పోసుకొని, ఊపిరిని పీల్చాయి.
అది 2,500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు కానివ్వండి, లేదా గడచిన శతాబ్దంలో మహాత్మ గాంధీ కానివ్వండి.. శాంతి మరియు ప్రేమ ల యొక్క పరిమళం భారతదేశపు తోటలో నుండే యావత్తు ప్రపంచానికి విస్తరించింది.
ఈ సందేశం యొక్క శీతలత్వం గాయాలకు మలాము ను పూసింది. దర్శనం మరియు మతం యొక్క ప్రసక్తిని వదలివేయండి.. ప్రతి ఒక్కరిలో ఒకే వెలుగు యొక్క కాంతి ఉంటుందనే భావన భారతదేశం జన మానసంలో నిక్షిప్తమైవుంది. మనిషి యొక్క తనువులోని ప్రతి అణువులోనూ అదే పరమాత్మ దివ్యత్వం గోచరమవుతోంది.
యువర్ మెజెస్టీ,
భారతదేశం యొక్క ఈ రాజధాని ఢిల్లీ ఇదివరకు ఇంద్రప్రస్థం గా ప్రసిద్ధికెక్కింది. ఇది సూఫీ పండితులు వర్ధిల్లిన గడ్డ కూడాను.
కొద్ది సేపటి క్రితం ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన ఎంతో లోకప్రియమైన సూఫీ సాధువు హజరత్ నిజాముద్దీన్ ఔలియా యొక్క దర్ గాహ్ ఇక్కడి నుండి కొద్ది దూరంలోనే ఉన్నది. దిల్లీ అనే పేరు దెహ్ లీజ్ అనే పదంలో నుండి వచ్చినటువంటిదే.
గంగ- జమున అనే రెండు నదులకు నిలయమైన ఈ గుమ్మం దేశం యొక్క కలగలిసిన గంగా- జమునా సంస్కృతి యొక్క ప్రవేశ ద్వారం కూడాను. ఇక్కడి నుండే భారతదేశ ప్రాచీన దర్శనం మరియు సూఫీల యొక్క ప్రేమ మరియు మానవతా వాదాల యొక్క మిశ్రిత సంప్రదాయం మానవాళికి మూలాధారమైన ఏకత అనే టటువంటి సందేశాన్ని అందించింది.
మానవ మాత్రుల యొక్క ఏకాత్మ అనే ఈ భావన యే భారతదేశానికి ‘వసుధైవ కుటుంబకమ్’ (ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అనే భావనను ప్రసాదించింది. దీనికి అర్థం- భారతదేశం మరియు భారతీయులు యావత్తు ప్రపంచాన్ని ఒక పరివారంగా సంభావించి వారితో తమ యొక్క గుర్తింపును స్వీకరించారు అన్నదే.
సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక వైవిధ్యం, బహుళత్వం, ఇంకా మా దృక్పథం లోని దాపరికం లేని తనం.. ఇవన్నీ కొన్ని తరాల తరబడి భారతదేశం యొక్క ఆనవాలుగా మిగిలాయి. ఇది భారతదేశపు ముద్రగా నిలచింది. మా సుసంపన్న వారసత్వం లోని వైవిధ్యం పట్ల, మా సంప్రదాయం లోని వైవిధ్యం పట్ల ప్రతి ఒక్క భారతీయుడు- అతడు ఏ భాషను మాట్లాడినా సరే; లేదా ఒక ఆలయంలో జ్యోతి ని వెలిగించినా లేదా ఒక మసీదులో మోకరిల్లినా లేదా ఒక క్రైస్తవ ప్రార్థనాలయంలో ప్రార్థన చేసినా లేదా గురుద్వారా లో శబద్ ను ఆలాపించినా సరే- గర్విస్తున్నాడు.
యువర్ మెజెస్టీ,
ప్రస్తుతం భారతదేశంలో రంగుల పండుగ హోళీని జరుపుకొంటున్నారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం కొద్ది రోజుల కిందట ప్రారంభమైంది.
ఈ నెల చివరలో యావత్ దేశం గుడ్ ఫ్రైడే ను జరుపుకొంటుంది. ఇది జరిగిన కొన్ని వారాలలో భారతదేశం బుద్ధ భగవానుని జయంతిని జరుపుకోనుంది.
అటు తరువాత పవిత్రమైన రంజాన్ మాసం ముగింపులో ఈద్-ఉల్-ఫితర్ వస్తుంది. ఈ పండుగ మనకు త్యాగాన్ని, పరస్పర సౌహార్దాన్ని మరియు సామరస్యాన్ని గుర్తుకు తెస్తుంది.
ఇవి శాంతి మరియు సౌహార్దతల యొక్క ఉత్సవాలు. భారతదేశంలో జరుపుకొనే పలు పండుగలలో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
మిత్రులారా,
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక రాజకీయ వ్యవస్థే కాకుండా సమానత్వం, వైవిధ్యం మరియు ఏకీభావాల మూలాధారం కూడాను. భారతదేశ ప్రజాస్వామ్యం మా అతి ప్రాచీన బహుళత్వం యొక్క ఉత్సవం. ఇది ఎటువంటి శక్తి అంటే, దీని మూలంగా ప్రతి ఒక్క భారతీయుడు దేశానికి చెందిన దివ్యమైన చరిత్ర పట్ల అతిశయాన్ని కలిగివున్నాడు. అతడు వర్తమానం పట్ల నమ్మకంతో పాటు భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కూడా కలిగివున్నాడు.
మిత్రులారా,
మన సంప్రదాయం యొక్క సంపన్న వైవిధ్యం అనిశ్చిత పరిస్థితులు, ఆందోళనకర పరిస్థితులతో నిండిన నేటి ప్రపంచంలో, హింస, ద్వేషంతో కలుషితమైపోయిన నేటి ప్రపంచంలో ఉగ్రవాదం, ఇంకా తీవ్రవాదం వంటి సవాళ్ళతో పోరాడడంలో ఎంతో సహాయకారిగా ఉంది.
మన యొక్క ఈ వారసత్వం మరియు మన యొక్క విలువలు, మన మతాలు ప్రవచిస్తున్నటువంటి సందేశం, ఇంకా సూత్రాలు ఏ శక్తి వంటివంటే, వీటి అందడండలతో మనం హింస, ఉగ్రవాదం వంటి సవాళ్ళను అధిగమించగలుగుతాం.
మిత్రులారా,
మానవాళి పైన అనాగరక దాడులను చేస్తున్న వారు.. వారు చెప్పుకొంటున్న మతం తరఫున ఈ విధ్వంసాన్ని కలగజేస్తున్నట్టు అర్థం చేసుకోవడంలో బహుశా విఫలం అవుతున్నట్లుగా ఉంది. ఉగ్రవాదం, తీవ్రవాదం ఇంకా సమూల సంస్కరణ వాదం.. వీటన్నింటికీ వ్యతిరేకమైన ఉద్యమం ఏ తెగకూ వ్యతిరేకమైంది కానే కాదు. ఇది మన యువజనులను పెడదోవ పట్టించి, వారు అమాయకుల మీద నేరాలకు తెగబడేటట్లు వారిని ఎగదోస్తున్న మనస్తత్వం పైన జరుపుతున్న పోరాటమే.
యువర్ మెజెస్టీ,
భారతదేశంలో ప్రతి ఒక్కరి వికాసం కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం అనేదే మా ప్రయత్నంగా ఉంది. ఇలా ఎందుకంటే యావత్తు దేశ భవితవ్యం ప్రతి ఒక్క పౌరుడి పురోగమనంతో ముడి పడి ఉంది కాబట్టి; ఇలా ఎందుకంటే, దేశం యొక్క ప్రసన్నతా ప్రతి ఒక్కరి సంతోషంతోనూ పెనవేసుకొని ఉంది కాబట్టి.
సజ్జనులారా,
ఇక్కడ పెద్ద సంఖ్యలో మీరు గుమికూడటం అనేది భావి తరాలకు ఒక మార్గాన్ని చూపించడం కోసం మీలో ఎంతటి దీక్షా భావం, ఎంతటి తపన ఉన్నాయో సూచిస్తోంది. మీరు యువజనుల పురోగతికి పెద్ద పీట వేస్తున్నారన్న సత్యానికి, అలాగే వారికి మానవ విలువలను బోధించాలన్న అంశానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా సూచిస్తోంది.
ముస్లిమ్ యువకులు ఒక చేత కురాన్ శరీఫ్ ను, మరొక చేత కంప్యూటర్ ను పట్టుకొని ఉండడాన్ని మీరు చూసినప్పుడు, అదుగో అప్పుడు మాత్రమే సర్వతోముఖ ఆనందం, సర్వ రంగ వికాసాలు సాధ్యపడుతాయి. మతం యొక్క సారాంశం ఎన్నటికీ అమానవీయమైంది కానే కాదు. మానవ విలువలు పురోగమించినప్పుడు మాత్రమే- ప్రతి ఒక్క తెగ, ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క సంప్రదాయం మనుగడ సాగించగలుగుతాయి. అందుకనే ప్రస్తుతపు అవసరం ఏమిటంటే, ఒక పక్క మన యువజనులను ఒక కృపామయమైన ఇస్లామ్ తో జోడించడమూ, మరొక పక్క వారు అభివృద్ధి పథంలో ముందుకు పోయేటందుకు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకొనేటట్లు చూడటమూను.
యువర్ మెజెస్టీ,
మీ యొక్క మార్గదర్శకత్వంలో వేసినటువంటి అడుగులు అనాగరక జ్వాలలను ఆర్పివేయడంలో ఎంతగానో తోడ్పడ్డాయి. అమ్మాన్ డిక్లరేశన్ పై సంతకాలు చేసిన వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. వారు ఇరువురూ ఈ సమయంలో ఇక్కడ మన మధ్య ఉండడం మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. ఈ తరహా బాధ్యతాయుతమైన చైతన్యాన్ని ఆవిష్కరించే మా ప్రయత్నం మీ వంటి ప్రభావ శీలురైన నాయకుల అండదండలు లభించడం, జోర్డాన్ వంటి మిత్ర దేశాల సహకారం లభించడంతో పాటు అన్ని వర్గాల, మతాలకు చెందిన నాయకుల సహకారం లభించడం వల్ల సాధ్యం అయింది.
మీరు ఇక్కడకు విచ్చేయడం వల్ల మా ప్రయత్నాలు అన్నీ మరింతగా బలోపేతం అవుతాయి. మీతో భారతదేశం భుజం భుజం కలిపి సమూల సంస్కరణ వాదాన్ని వ్యతిరేకించడం పట్ల మీరు చేస్తున్న కృషికి మద్దతిస్తుంది. భారతదేశం లోని వేయి మందికి పైగా ఉలేమాలు, ధార్మికవేత్తలు మరియు మత నాయకులు ఇక్కడకు తరలివచ్చి ఈ విషయమై మీకు ఒక భరోసా ను అందిస్తున్నారు. వారు ఇక్కడకు హాజరయ్యారంటే వారు తమ ఆలోచనలను మీతో పంచుకోవాలని వచ్చారన్న మాట. అలా పంచుకోవడం ద్వారా మీ యొక్క నాయకత్వం అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని, ధైర్యాన్ని వారు స్ఫూర్తిగా తీసుకొంటార్న మాటే. నా అభ్యర్థనను మన్నించి ఇక్కడకు మీరు తరలి వచ్చినందుకు మీ పట్ల నేను ఎంతో కృతజ్ఞుడిని.
సజ్జనులారా,
ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నందుకు గాను మీకు ఇవే నా అనేకానేక ధన్యవాదాలు.
మీకు బహుధా ధన్యవాదాలు.
***
आपका वतन और हमारा दोस्त देश जॉर्डन इतिहास की किताबों और धर्म के ग्रंथों में एक अमिट नाम है।
— PMO India (@PMOIndia) March 1, 2018
जॉर्डन एक ऐसी पवित्र भूमि पर आबाद है जहां से ख़ुदा का पैग़ाम पैगम्बरों और संतों की आवाज़ बनकर दुनिया भर में गूंजा: PM @narendramodi
दुनिया भर के मज़हब और मत भारत की मिट्टी में पनपे हैं। यहां की आबोहवा में उन्होंने ज़िन्दगी पाई, साँस ली। चाहे वह 2500 साल पहले भगवान बुद्ध हों या पिछली शताब्दी में महात्मा गांधी। अमन और मुहब्बत के पैग़ाम की ख़ुशबू भारत के चमन से सारी दुनिया में फैली है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 1, 2018
यहाँ से भारत के प्राचीन दर्शन और सूफियों के प्रेम और मानवतावाद की मिलीजुली परम्परा ने मानवमात्र की मूलभूत एकता का पैगाम दिया है।मानवमात्र के एकात्म की इस भावना ने भारत को 'वसुधैव कुटुम्बकम्' का दर्शन दिया है।भारत ने सारी दुनिया को एक परिवार मानकर उसके साथ अपनी पहचान बनाई है: PM
— PMO India (@PMOIndia) March 1, 2018
हर भारतीय को गर्व है अपनी विविधता की विशेषता पर।
— PMO India (@PMOIndia) March 1, 2018
अपनी विरासत की विविधता पर, और विविधता की विरासत पर। चाहे वह कोई ज़ुबान बोलता हो। चाहे वह मंदिर में दिया जलाता हो या मस्जिद में सज़दा करता हो, चाहे वह चर्च में प्रार्थना करे या गुरुद्वारे में शबद गाये: PM
दुनिया के सबसे बड़े लोकतंत्र भारत में democracy एक राजनैतिक व्यवस्था ही नहीं बल्कि समानता, विविधता और सामंजस्य का मूल आधार है। Indian democracy is a celebration of our age old plurality: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 1, 2018
यह वो शक्ति है जिसके बल पर हर भारतीय के मन में आपने गौरवशाली अतीत के प्रति आदर है, वर्तमान के प्रति विश्वास है और भविष्य पर भरोसा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 1, 2018
हमारी विरासत और मूल्य, हमारे मज़हबों का पैगाम और उनके उसूल वह ताक़त हैं जिनके बल पर हम हिंसा और दहशतगर्दी जैसी चुनौतियों से पार पा सकते हैं
— PMO India (@PMOIndia) March 1, 2018
इंसानियात के ख़िलाफ़ दरिंदगी का हमला करने वाले शायद यह नहीं समझते कि नुकसान उस मज़हब का होता है जिसके लिए खड़े होने का वो दावा करते हैं: PM
भारत में हमारी यह कोशिश है कि सबकी तरक्की के लिए सबको साथ लेकर चलें।
— PMO India (@PMOIndia) March 1, 2018
क्योंकि सारे मुल्क की तकदीर हर शहरी की तरक्की से जुड़ी है। क्योंकि मुल्क की खुशहाली से हर एक की खुशहाली बाबस्ता है: PM
मज़हब का मर्म अमानवीय हो ही नहीं सकता। हर पन्थ, हर संप्रदाय, हर परंपरा मानवीय मूल्यों को बढ़ावा देने के लिए ही है।
— PMO India (@PMOIndia) March 1, 2018
इसलिए, आज सबसे ज्यादा ज़रूरत ये है कि हमारे युवा एक तरफ मानवीय इस्लाम से जुड़े हों और दूसरी तरफ आधुनिक विज्ञान और तरक्की के साधनों का इस्तेमाल भी कर सकें: PM
It was an honour to take part in a conference on ‘Islamic Heritage: Promoting Understanding and Moderation’, where His Majesty @KingAbdullahII delivered an insightful address. I would urge you all to hear his wise words. https://t.co/W4962t5jXP pic.twitter.com/VWXQENCVPl
— Narendra Modi (@narendramodi) March 1, 2018
Glad to have distinguished members of the Muslim community, scholars, spiritual leaders and others during the conference on ‘Islamic Heritage: Promoting Understanding and Moderation.’ Members of the Muslim community have excelled in several fields over the years. pic.twitter.com/5xhjDe7lwn
— Narendra Modi (@narendramodi) March 1, 2018
Islamic culture is flourishing across India. The influence of Sufism spreads the message of love, peace and brotherhood. The Government of India is leaving no stone unturned in empowering the Muslim youth. We want them to have the Quran in one hand and a computer in the other.
— Narendra Modi (@narendramodi) March 1, 2018