Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేబినెట్ దృష్టికి ఇండియా, గయానాల మ‌ధ్య కుదిరిన పున‌రుత్పాద‌క‌ ఇంధ‌నంపై స‌హ‌కార అవ‌గాహ‌నా ఒప్పందం


ఇండియా గ‌యానాల‌మ‌ధ్య కుదిరిన పున‌రుత్పాద‌క ఇంధ‌నంపై స‌హ‌కార అవ‌గాహ‌నా ఒప్పంద విశేషాల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్‌కు వివ‌రించ‌డం జ‌రిగింది. 2018 జ‌న‌వ‌రి 30న న్యూఢిల్లీలో కేంద్ర విద్యుత్‌, నూత‌న ,పున‌రుత్పాద‌క ఇంధ‌న శాఖ స‌హాయ‌మంత్రి (స్వతంత్ర‌) శ్రీ ఆర్‌.కె.సింగ్‌, గ‌యానా విదేశాంగ శాఖ‌మంత్రి , రెండో ఉపాధ్య‌క్షుడు కార్ల్ బి.గ్రీనిడ్గేల మ‌ధ్య ఈ ఒప్పందంపై సంత‌కాలు జ‌రిగాయి. ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం, స‌మాన‌త్వం, ఇచ్చిపుచ్చుకునే రీతిలో నూత‌న‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో సాంకేతిక ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించేందుకు , అలాగే ఇరు ప‌క్షాలూ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి వ్య‌వ‌స్థాగ‌త సంబంధాల‌ను ఏర్ప‌ర‌చుకునేందుకు ఒక ప్రాతిప‌దిక‌ను ఏర్పాటు చేయాల‌ని ఈ ఒప్పందం ఆకాంక్షిస్తోంది. ,ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించిన అంశాల‌ను చ‌ర్చించ‌డానికి , ప‌ర్య‌వేక్షించ‌డానికి, స‌మీక్షించ‌డానికి ఒక సంయుక్త వ‌ర్కింగ్ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఈ అవ‌గాహ‌నా ఒప్పందం నిర్దేశిస్తున్న‌ది. త‌మ‌ నైపుణ్యాల‌ను ప‌ర‌స్ప‌రం అంద‌జేసుకోవ‌డం, స‌మాచార నెట్‌వ‌ర్కింగ్‌ను కూడా ఈ అవ‌గాహ‌నా ఒప్పందం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఉభ‌య దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డానికి ఈ అవ‌గాహ‌నా ఒప్పందం దోహ‌ద‌ప‌డుతుంది.