Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్య‌వ‌స్థీకృత నేరాల అదుపు, అంత‌ర్జాతీయ నేరాల‌ను ఎదుర్కొనే విష‌య‌మై ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి మరియు స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకొనేందుకు ఉత్త‌ర ఐర్లాండ్‌, యునైటెడ్ కింగ్‌డ‌మ్‌, భారతదేశం ల మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం మరియు తీవ్ర‌మైన‌ వ్య‌వ‌స్థీకృత నేరాల అదుపు విష‌యాలపై ప‌ర‌స్ప‌రం స‌హ‌కరించుకోవడానికి, ఇంకా స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికిగాను ఉత్త‌ర ఐర్లాండ్‌, యునైటెడ్ కింగ్‌డ‌మ్‌, ఇంకా భారతదేశం ల మ‌ధ్య కుదిరినటువంటి అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.

నేరాల ద‌ర్యాప్తు, ప్రాసిక్యూష‌న్‌, నేర‌గాళ్ల ఆచూకీ తెలుసుకోవ‌డం, నేరాల అదుపు, నేర‌గాళ్ల ఆస్తులకు, నేరాల‌కు పాల్ప‌డేందుకు ఉప‌యోగించే సాధ‌నాల స్వాధీనం (క‌రెన్సీ బ‌దిలీతో సంబంధం ఉన్న నేరాల విష‌యంలో కూడా), ఉగ్ర‌వాద నిధులకు సంబంధించి భారతదేశం, యు.కె ల‌ మ‌ధ్య ఇప్ప‌టికే ఒక ఒప్పందం ఉంది. దీనిపై 1995 లో సంత‌కాలు జ‌రిగాయి. అంతర్జాతీయ నేరాలు, తీవ్ర‌మైన వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు వ్య‌తిరేకంగా పోరాటంలో త‌మ మ‌ధ్య స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని ఇరు దేశాలూ ఆకాంక్షిస్తున్నాయి. భ‌ద్ర‌త రంగంలో స‌హ‌కారాన్ని ఉభ‌య ప‌క్షాల‌కూ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఈ ఎమ్ఒయు మ‌రింత శ‌క్తిమంతం చేస్తుంది.

***