Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యువ నూత‌న ఆవిష్క‌ర్త‌లు మ‌రియు స్టార్ట్‌-అప్ ల‌కు చెందిన న‌వ పారిశ్రామికుల‌తో రేపు ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌


యువ నూత‌న ఆవిష్క‌ర్త‌లు మ‌రియు స్టార్ట్‌-అప్ ల‌కు చెందిన న‌వ పారిశ్రామికుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు సంభాషించ‌నున్నారు.

‘‘స్టార్ట్‌-అప్ లు, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల లోకానికి చెందిన యువ ప్ర‌తిభావంతుల‌తో రేపు ఉద‌యం తొమ్మిదిన్నర గంట‌ల‌కు నేను ఒక ఉత్తేజిత‌భ‌రిత‌మైన సంభాష‌ణ‌ లో పాలుపంచుకోబోతున్నాను. స్టార్ట్‌-అప్ ఆంత్ర‌ప్రెన్యోర్ లుగా రాణించిన మార్గ‌ద‌ర్శ‌కులైన యువ నూత‌న ఆవిష్క‌ర్త‌ల అభిప్రాయాల‌ను నేరుగా వినే ఒక అద్భుత‌మైన అవ‌కాశాన్ని ఈ ముఖాముఖి అందించ‌నుంది.

భార‌త‌దేశం స్టార్ట్‌-అప్ ల‌కు మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఒక కేంద్రంగా ఆవిర్భవించింది. భార‌త‌దేశానికి చెందిన యువ ప్ర‌తిభావంతులు వారిదైన భావి దార్శ‌నిక‌త‌తో కూడిన మ‌రియు సాంప్ర‌దాయ ఛేద‌క ఆలోచ‌న‌ల స‌ర‌ళితో పేరు తెచ్చుకొన్నారు. రేపటి ముఖాముఖి లో ప్ర‌ముఖ ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ లు, టింక‌రింగ్ ల్యాబ్ ల‌కు చెందిన యువ ప్ర‌తిభావంతులు కూడా పాలుపంచుకోనున్నారు.

రేప‌టి ముఖాముఖి లో పాలుపంచుకోవాల్సిందిగా ప్ర‌ధానంగా నా యువ మిత్రుల‌కు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. నేర్చుకోవ‌డానికి, ఎద‌గ‌డానికి, ఇంకా స్ఫూర్తిని పొంద‌డానికి ఇది ఒక అద్భుత‌మైన మార్గం. ఈ ముఖాముఖి లో మీరు ‘Narendra Modi Mobile App’ లేదా @DDNewsLive ల ద్వారా పాల్గొన‌వ‌చ్చు. మీకు ఏదైనా ఉపాయం లేదా స‌ల‌హా త‌డితే గనక దానిని సామాజిక మాధ్య‌మం లో పంచుకోగ‌ల‌రు’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

***