పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం – భద్రత, సహకారం అంశంపై భారత్ – జర్మనీల మధ్య ఒక అవగాహనా పూర్వక ఒప్పందం (ఎం.ఓ.యు) కోసం అనుమతి తెలిపింది. ఈ ఎం.ఓ.యు ద్వైపాక్షిక సంబంధాలను సమాచారం, నైపుణ్యం, ఉత్తమ సాంకేతిక విజ్ఞానాల పరస్పర మార్పిడి ద్వారా మరింత పటిష్టం చేయనుంది. అంతేకాకుండా ఉగ్రవాదంపై పోరు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సీమాంతర నేరాల నిరోధానికి ఎంతగానో ఉపయోగపడనుంది.