పిఎంఇండియా
పశువుల ఆరోగ్య పరిరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం ఉద్దేశించిన ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాల ప్రతిపాదనను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ ఎంఓయూ పై 2014 సెప్టెంబర్‌లో సంతకాలు జరిగాయి. కొన్ని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పశువుల ఆరోగ్య పరిరక్షణకు రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చాటి చెప్పడం ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం. ఎంఓయూలో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
1. పశువుల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం…. మరీ ముఖ్యంగా జంతువులకు సోకే వ్యాధులకు సంబంధించిన సమాచార మార్పిడి… ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చే సందర్భాలలో పాటించతగిన ప్రమాణాలు, తనిఖీ ప్రక్రియలు,
వాటికి అందించే ఆహారానికి సంబంధించిన నియమాల వంటివి రెండు దేశాలు ఒకదానికి ఒకటి అందజేసుకుంటాయి.
2. మాంసం శుద్ధి, మాంస ఉత్పత్తులు, కబేళాలకు సంబంధించిన ప్రత్యేక సమాచార మార్పిడి.
3. పశువుల ఆరోగ్య పరిరక్షణకు, హెల్త్ సర్టిఫికెట్ ల జారీకి ఇరుపక్షాల సంబంధిత అధికార సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకోవడం.
4. పశువుల ఆరోగ్య పరిరక్షణ రంగంలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి ఎప్పటికప్పుడు అందించాల్సిన మెరుగైన శిక్షణ కోసం ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవడం.
ఈ ఎంఓయూ ను రద్దు పరచుకోవాలనుకుంటున్నట్లు ఉభయ దేశాలలోనూ ఏదైనా ఒక దేశం కనీసం 6 నెలల ముందు లిఖితపూర్వక నోటీసు ఇస్తే తప్ప 10 సంవత్సరాలపాటు అమలులో ఉంటుంది.