Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా న‌దుల అనుసంధానం కార్య‌క్ర‌మం కింద చేప‌ట్టిన ప‌నుల పురోగ‌తిపై నివేదిక‌


దేశంలో న‌దుల అనుసంధానానికి సంబంధించి న‌దీ జ‌లాల మంత్రిత్వ‌శాఖ రూపొందించిన స్టేట‌స్ క‌మ్ ప్రోగ్రెస్ రిపోర్టుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశ‌మ‌యింది. 2002 సంవ‌త్స‌రంలో దాఖ‌లైన రెండు రిట్ పిటీష‌న్లు… నెట్‌వ‌ర్కింగ్ ఆఫ్ రివ‌ర్స్ తాలూకూ రిట్ పిటీష‌న్ (సివిల్‌) – 512, రిట్ పిటీష‌న్ – 668 ల పై సుప్రీంకోర్టు వెలువ‌రించిన తీర్పున‌కు అనుగుణంగా ఈ చ‌ర్య చేప‌ట్టారు. జాతీయ దీర్ఘ ద‌ర్శి ప్ర‌ణాళికలో భాగంగా చేప‌ట్టే న‌దుల అనుసంధాన ప‌థ‌కాలను ప‌ర్య‌వేక్షించ‌డంలో ఈ నివేదిక తోడ్ప‌డ‌నుంది. న‌దుల అనుసంధానంపై ఏర్పాటైన ప్ర‌త్యేక సంఘం రెండేళ్ళ‌కు ఒక‌సారి ఇటువంటి స్టేట‌స్ క‌మ్ ప్రోగ్రెస్ రిపోర్టును కేంద్ర మంత్రివ‌ర్గం ప‌రిశీల‌న‌కు అందిస్తుంది. దేశ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని త‌గిన తుది నిర్ణ‌యాల‌ను వీలైనంత త్వ‌రితంగా తీసుకొనేటందుకు ఈ ద్వైవార్షిక నివేదిక దోహ‌ద‌ప‌డుతుంది.