Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాప్-21 స‌ద‌స్సుకు ప్ర‌ధాని

కాప్-21 స‌ద‌స్సుకు ప్ర‌ధాని

కాప్-21 స‌ద‌స్సుకు ప్ర‌ధాని


ప‌ర్యావ‌ర‌ణం, వాతావ‌ర‌ణ మార్పుల‌పై పారిస్‌లో 2015 న‌వంబ‌రు 30న జ‌రిగే కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్‌)-21 స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి శ్రీ‌ న‌రేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ‌ ఫ్రాంకోయిస్ హోలెండ్‌తో క‌ల‌సి ఆయ‌న సంయుక్తంగా అంత‌ర్జాతీయ సౌర బంధం స‌మావేశానికి ఆతిథ్య‌మిస్తారు. అమెరికా అధ్య‌క్షుడు ఆతిథ్య‌మిచ్చే మిష‌న్ ఇన్నోవేష‌న్ లో కూడా ప్ర‌ధాని శ్రీ‌ మోదీ పాల్గొంటారు. ” కాప్‌-21 స‌ద‌స్సులో పాల్గొన‌టానికి పారిస్ కు బ‌య‌లుదేరుతున్నాను. ప‌ర్యావ‌ర‌ణం, వాతావ‌ర‌ణ మార్పులకు సంబంధించిన కీల‌క అంశాల‌ను ఈ స‌ద‌స్సులో చ‌ర్చించ‌బోతున్నాం. ఈ స‌ద‌స్సులో భార‌త పెవిలియ‌న్‌ను ఆరంభిస్తాం. ప్ర‌కృతితో, ప‌ర్యావ‌ర‌ణంతో భార‌త్ ఎంత‌గా మ‌మేక‌మైందో, వాతావ‌ర‌ణ మార్పుల‌ను ఎదుర్కోవ‌టానికి ఎలా క‌ట్టుబ‌డి ఉందో ఈ పెవిలియ‌న్ క‌ళ్ల‌కు క‌డుతుంది. నేనూ, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ‌ ఫ్రాంకోయిస్ హోలెండ్ క‌ల‌సి సంయుక్తంగా అంత‌ర్జాతీయ సౌర‌బంధం స‌మావేశానికి ఆతిథ్య‌మిస్తాం. అమెరికా అధ్య‌క్షుడు నిర్వ‌హించే మిష‌న్ ఇన్నోవేష‌న్ స‌మావేశానికి కూడా హాజ‌ర‌వుతున్నాను” అని ప్ర‌ధాని శ్రీ మోదీ ట్వీట్ చేశారు.