Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన‌ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టులు విదేశాల‌లో చేప‌ట్టేందుకు బిడ్డింగ్‌వేసే భార‌తీయ సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తుగా రాయితీతో కూడిన ఫైనాన్సింగ్ స్కీమ్‌(సిఎఫ్ఎస్‌)ను కొన‌సాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ , వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టులు విదేశాల‌లో చేప‌ట్టేందుకు బిడ్డింగ్‌వేసే భార‌తీయ సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తుగా రాయితీతో కూడిన ఫైనాన్స్ ప‌థ‌కం తొలి కొన‌సాగింపున‌కు ఆమోదం తెలిపింది.

వివ‌రాలు….

సి.ఎఫ్‌.ఎస్ కింద భార‌త ప్ర‌భుత్వం 2015-16 సంవ‌త్స‌రం నుంచి , విదేశాల‌లో మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించి వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన ప్రాజెక్టుల బిడ్డింగ్ వేసే భార‌తీయ సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ఈ ప‌థ‌కం ల‌క్ష్యాల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఇంకా ఉన్నందున 2018 నుంచి 2023 వ‌ర‌కు మ‌రో ఐదు సంవ‌త్స‌రాల‌పాటు ఈ రాయితీని పొడిగించాల‌ని ప్ర‌తిపాదించారు.

 

ఆర్థిక ప‌ర్య‌వ‌సానాలు….

ఇంట‌రెస్ట్ ఈక్వ‌లైజేష‌న్ స‌పోర్ట్ (ఐఇఎస్‌) కింద లెండింగ్ బ్యాంకుల‌కు చెల్లింపులు చేసేందుకు, ప్ర‌తి ఏటా డిపార్ట‌మెంట్ ఆఫ్ ఎక‌న‌మిక్ అఫైర్స్ బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేయ‌నుంది.అవి ఇలా ఉండ‌నున్నాయి.

 

 

ఐఇఎస్ మొత్తం మిలియ‌న్ డాల‌ర్ల‌లో

6.5

 

10.00

 

18.75

 

29.00

 

32.00

 

96.25

 

ఐఇఎస్ మొత్తం ఐఎన్ఆర్ కోట్ల‌లో

42.25

 

65.00

 

121.88

 

188.50

 

208.00

 

625.63

 

సంవ‌త్స‌రం

 

2018-19

 

2019-20

 

2020-21

 

2021-22

 

2022-23

 

మొత్తం

 

 

నోట్‌…అంచ‌నా వేసిన ఐఇఎస్ ప్ర‌స్తుత ప్రాజెక్టుకు సంబంధించిన‌ది మాత్ర‌మే.

ప్ర‌ధాన ప్ర‌భావం…..

సి.ఎఫ్‌.ఎస్ ప్ర‌వేశ‌పెట్ట‌క‌ముందు, భార‌త సంస్థ‌లు విదేశాల‌లోని భారీ ప్రాజెక్టుల‌కు బిడ్డింగ్ వేయ‌గ‌ల స్థితిలో లేవు. ఈ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ వ్య‌యం చాలా ఎక్కువ‌గా ఉండ‌గా, చైనా, జ‌పాన్‌, యూర‌ప్‌, అమెరికా వంటి దేశాల బిడ్డ‌ర్ల‌కు మెరుగైన నిబంధ‌న‌ల‌తో నాణ్య‌మైన రుణ స‌దుపాయం అందుబాటులో ఉండేది. త‌క్కువ వ‌డ్డీ రేటు, దీర్ఘ‌కాలంలో తిరిగి చెల్లింపుల‌కు అవ‌కాశం వంటివి ఈదేశాల బిడ్డ‌ర్ల‌కు అనుకూలంగా ఉండేవి.

ఇక‌, భార‌తీయ సంస్థ‌లుచేప‌ట్టే వ్యూహాత్మ‌క విదేశీ ప్రాజెక్టుల వ‌ల్ల సిఎఫ్ఎస్ ఇండియాలో పెద్ద ఎత్తున ఉపాధి, మెటీరియ‌ల్‌, యంత్రాల‌కు ఇండియాలో డిమాండ్‌కు సంబంధించి అవ‌కాశాలు అందుబాటులోకి వ‌స్తాయి. అలాగే ఇండియాకు మంచి గుడ్‌విల్ ఉంటుంది.

అమ‌లు వ్యూహం, ల‌క్ష్యాలు :

ఈ ప‌థ‌కం కింద , ఎం.ఇ.ఎ భార‌త దేశ వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక ప్రాజెక్టుల‌ను ఎంపిక‌చేసి వాటిని డిపార్ట‌మెంట్ ఆఫ్ ఎక‌న‌మిక్ అఫైర్స్‌(డిఇఎ)కు పంపుతుంది.

ఈ ప‌థ‌కం కింద వ్యూహాత్మ‌క ప్రాధాన్య‌త‌గ‌ల ఏ ప్రాజెక్టుకు ఫైనాన్సింగ్ అర్హ‌త ఇవ్వాల‌న్న‌ అంశాన్ని, ఆయా ప్రాజెక్టుల వారీగా డిఇఎ కార్య‌ద‌ర్శి అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన క‌మిటీ నిర్ణ‌యిస్తుంది. ఇందులో స‌భ్యులుగా వ్య‌య‌విభాగ ప్ర‌తినిధులు, విదేశీవ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌, పారిశ్రామిక ప్రోత్సాహ‌కాలు, విధానాల‌ విభాగం (డిఐపిపి) ,డిపార్ట‌మెంట్ ఆఫ్ కామ‌ర్స్‌, డిపార్ట‌మెంట్ ఆఫ్ పైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స‌భ్యులుగా ఉంటారు.జాతీయ భ‌ద్ర‌తా డిప్యూటీ స‌ల‌హాదారు కూడా ఈ క‌మిటీలో స‌భ్యులుగా ఉంటారు. ఒక సారి క‌మిటీ ఆమోదం తెలిపితే, డిఇఎ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్‌కు లాంఛ‌నంగా లేఖ అంద‌జేయ‌డం ద్వారా సి.ఎఫ్‌.సి కింద పైనాన్సింగ్‌కు త‌మ అనుమ‌తి తెలుపుతారు.

ఈ ప‌థ‌కం ప్ర‌స్తుతం ఎగుమ‌తులు ,దిగుమ‌తుల బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా నిర్వ‌హింప‌బ‌డుతోంది.ఇది మార్కెట్ నుంచి వ‌న‌రులు స‌మకూర్చుకుని రాయితీపై ఫైనాన్స్‌ను అంద‌జేస్తుంది. భార‌త‌ప్ర‌భుత్వం కౌంట‌ర్ గ్యారంటీ , రెండు శాతం వ‌డ్డీ ఈక్వ‌లైజేష‌న్ మ‌ద్ద‌తును ఎగ్జిమ్ బ్యాంక్‌కుఅంద‌జేస్తుంది.

 

నేప‌థ్యం…:

ఏదైనా భార‌తీయ సంస్థ , విదేశీ ప్ర‌భుత్వం, లేదా విదేశీ ప్ర‌భుత్వ యాజ‌మాన్య లేదా నియంత్ర‌ణ‌లోని సంస్థ‌ కీల‌క వ్యూహాత్మ‌క మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టును అమ‌లుచేయ‌డానికి అనుమ‌తి పొందిన‌ట్ట‌యితే అలాంటి వాటికి భార‌త ప్ర‌భుత్వం కౌంట‌ర్ గ్యారంటీ , రెండు శాతం వ‌డ్డీ ఈక్వ‌లైజేష‌న్‌ను ఎగ్జిమ్ బ్యాంకుకు ఇచ్చేందుకు ఈ ప‌థ‌కం కింద వీలు క‌ల్పించారు. ఈ ప‌థ‌కం కింద‌, ఎక్జిమ్ బ్యాంకు రుణాన్ని ఎల్‌.ఐ.బి.ఒ.ఆర్ (ఆరునెల‌ల స‌గ‌టు)ను మించ‌కుండా+ 100 బిపిఎస్‌ల రుణం అంద‌జేస్తుంది. రుణం తిరిగి చెల్లింపు విదేశీ ప్ర‌భుత్వ గ్యారంటీ ఉంటుంది.