పిఎంఇండియా
వైజ్ఞానిక పరమైన సహకారం మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధ సహకారం అంశం పై భారతదేశానికి, ఇండోనేశియా కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఎంఒయు పై భారతదేశం పక్షాన న్యూ ఢిల్లీ లో 2018 మే నెలలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా భూ శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, అలాగే ఇండోనేశియా తరపున జకార్తా లో 2018 మే నెలలో పరిశోధన, సాంకేతిక విజ్ఞానం మరియు ఉన్నత విద్య శాఖ మంత్రి శ్రీ మొహ్మద్ నాసిర్ సంతకాలు చేశారు. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం రంగం లో పరస్పర ప్రయోజనాలను చెప్పుకోదగ్గ స్థాయిలో మిళితం చేసుకోవడానికి ఉభయ పక్షాలు ఇక తమ తమ శక్తి యుక్తులను వినియోగిస్తాయి. ఈ కారణంగా ఎంఒయు పై సంతకాలు ద్వైపాక్షిక సంబంధాల లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి.
భారతదేశానికి, ఇండోనేశియా కు మధ్య సమానత్వం తో పాటు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞాన రంగం లో సహకారాన్ని ప్రోత్సహించడం ఎంఒయు ధ్యేయం గా ఉంది. దీనితో సంబంధం ఉన్న వర్గాలలో శాస్త్ర విజ్ఞాన సంస్థ లకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశోధన & అభివృద్ధి (ఆర్ & డి) ప్రయోగశాల లకు తోడు భారతదేశం, ఇండోనేశియా లకు చెందిన కంపెనీలు కూడా ఉంటాయి. అంతేకాకుండా, తక్షణ సహకారానికి గుర్తించిన రంగాలలో- సమాచారం, ఇంకా కమ్యూనికేశన్; సాంకేతికత; సముద్ర విజ్ఞాన శాస్త్రం మరియు టెక్నాలజీ; లైఫ్ సైన్సెస్ (బయో టెక్నాలజీ, వ్యవసాయం మరియు బయో మెడికల్ సైన్స్ సహా); శక్తి రంగం లో పరిశోధన; జల సంబంధ సాంకేతికత; విపత్తు నిర్వహణ; అంతరిక్ష విజ్ఞాన శాస్త్రాలు; సాంకేతికత మరియు అప్లికేశన్ లు; జియో స్పేశల్ ఇన్ఫర్మేశన్ ఇంకా అప్లయడ్ కెమిస్ట్రీ లు- ఉన్నాయి.
**