పిఎంఇండియా
కేంద్ర జాబితా లో ఇతర వెనుకబడిన కులాల ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు కమిషన్ పదవీకాలాన్ని 2018 నవంబర్ వరకు పొడిగించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ అంశం తో సంబంధం ఉన్నటువంటి వర్గాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ లు, వివిధ సముదాయ సంఘాల తో పాటు వేరు వేరు వెనుకబడిన కులాలకు మరియు కమిషన్ లకు చెందిన సాధారణ ప్రజానీకం తో ఈ కమిషన్ విస్తృత స్థాయి లో సమావేశాలను నిర్వహించింది. అంతేకాదు, ఈ కమిషన్ ఉన్నత విద్య సంస్థ లో చేరిన ఒబిసి ల కులంవారీ రికార్డులను మరియు ఇదే మాదిరిగా కేంద్ర విభాగాలలో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రభుత్వ రంగ బ్యాంకులలో, ఇంకా ఆర్థిక సంస్థల లో జరిగిన భర్తీ ల కులంవారీ సమాచారాన్ని కూడా స్వీకరించింది.
పరిశీలించిన మరియు విశ్లేషించిన సమాచారం ఆధారంగా ఉప వర్గీకరణ కు సంబంధించిన జాబితాలను మరియు తత్సంబంధిత నివేదిక ను ఖరారు చేసే కన్నా ముందు రాష్ట్రాల తోను, ఆయా రాష్ట్రాల వెనుకబడిన కులాల కమిషన్ ల తోను మరో విడత చర్చ జరపవలసిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కమిషన్ వెలిబుచ్చింది.
**