పిఎంఇండియా
భారతదేశానికి, జపాన్ కు మధ్య 1989లో ప్రోటోకాల్ (దౌత్యపరమైన విధివిధానాల అధికార వ్యవస్థ) ద్వారా కుదిరిన ఒప్పందమే ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం. దీన్నే డబుల్ ట్యాక్సేసన్ అవాయిడెన్స్ కన్వెన్షన్ (డిటిఏసి) అంటారు. ద్వంద్వ పన్నుల విధానం లేకుండా చేయాలని, ఆర్థికపరమైన ఎగవేతల్ని అరికట్టాలని దీన్ని ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పంద సవరణకు సంబంధించిన ప్రోటోకాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ప్రోటోకాల్ ప్రకారం ఆమోదిత అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఇరు దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. పన్నులకు సంబంధించిన ఈ సమాచారంలో బ్యాంకుల సమాచారం కూడా ఉంటుంది. భారతీయ పౌరునికి సంబంధించి జపాన్ నుంచి ఇండియా అందుకున్న సమాచారాన్ని, జపాన్ కు చెందిన సంబంధిత అధికార వ్యవస్థ ఆమోదం ప్రకారం దేశంలోని మరే ఇతర చట్టపరమైన సంస్ లతోనైనా పంచుకోవడానికి ఈ ప్రోటోకాల్ లో వెసులుబాటు ఉంది. ఇదే నియమం జపాన్ దేశ పౌరునికి సంబంధించిన సమాచారాన్ని ఇండియా జపాన్‌కు అందించిన సందర్భంలో కూడా వర్తిస్తుంది.
ప్రభుత్వంగానీ, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్థిక సంస్థలుగానీ బీమా చేసిన బకాయిల వసూళ్ల విషయంలో ఇండియా జపాన్ లు ఒక దేశానికి మరొకటి సహాయం చేసుకోవడానికి వీలుగా ఈ ప్రోటోకాల్ లో మరో నియమాన్ని పొందుపరిచారు. పన్ను ఏ దేశంలో వసూలు చేస్తారో ఆ దేశంలో వడ్డీపై వచ్చే ఆదాయానికి పన్నునుంచి మినహాయింపునిచ్చారు.