Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జావెలిన్ త్రో పురుషుల ఫైన‌ల్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న శ్రీ‌ నీర‌జ్ చోప్ డా కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఇండోనేశియా లోని జ‌కార్తా – పాలెంబాంగ్ లో జరుగుతున్న 18వ ఏశియ‌న్ గేమ్స్-2018 లో జావెలిన్ త్రో పురుషుల ఫైన‌ల్స్ విభాగం లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ నీర‌జ్ చోప్ డా కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“నీర‌జ్ చోప్ డా గారు మైదానం లో ఉన్నారంటే, ఆయ‌న అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ను ఇస్తార‌ని మనం ఆశించ‌వ‌చ్చు. ఈ యువ ప్ర‌తిభాశాలి జావెలిన్ త్రో పురుషుల ఫైన‌ల్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకోవ‌డం ద్వారా భార‌త‌దేశానికి సంతోషాన్ని పంచిపెట్టారు. ఒక కొత్త జాతీయ రికార్డు ను నెల‌కొల్పినందుకు కూడా ఆయ‌న‌ ను మ‌నం అభినందిద్దాం” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

**