పిఎంఇండియా
వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో సహకారం అంశం పై భారతదేశానికి, ఈజిప్టు కు మధ్య ఎంఒయు కు అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎంఒయు వ్యవసాయ పంటలు (ప్రత్యేకించి గోధుమలు మరియు మొక్కజొన్న), అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, వాటర్ హార్వెస్టింగ్ మరియు సూక్ష్మ సేద్య సాంకేతిక విజ్ఞానం సహా నీటిపారుదల, ఇంకా నీటి నిర్వహణ సంబంధిత సాంకేతికత, శక్తి ని ఉత్పత్తి చేసేందుకుగాను వ్యావసాయిక వ్యర్థాలను వినియోగించుకోవడం, ఆహార భద్రత, తోటపంటలు, సేంద్రియ వ్యవసాయం, పశుపోషణ, పశుగణం పెంపకం, పాడి పరిశ్రమ, చేపల పరిశ్రమ, దాణా ఉత్పత్తి, పశు సంబంధ ఉత్పత్తులు మరియు విలువ జోడింపులు, శానిటరీ అండ్ ఫైటో-శానిటరీ ఇష్యూస్, చిన్న స్థాయి లో వ్యవసాయ సంబంధ యంత్రాల వాడకం, వ్యవసాయ సంబంధ వ్యాపారం మరియు మార్కెటింగ్, నాట్ల కు ముందు, నాట్ల అనంతరం పాటించవలసిన ప్రక్రియలు, ఫూడ్ టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, వ్యవసాయం లో సమీకృత కీటక నాశినుల నిర్వహణ, వ్యవసాయ రంగ విస్తరణ మరియు గ్రామీణ అభివృద్ధి, మేధో సంపత్తి హక్కుల అంశాలు, విత్తన రంగంలో సాంకేతికత సంబంధిత మెలకువలు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల వికాసం, ఇంకా సామర్థ్య నిర్మాణం తో పాటు ఇరు పక్షాలు అంగీకరించే మేరకు మరేవైనా పరస్పర హితకరమైన రంగాలలో సహకరించుకోవడానికి ఈ ఎంఒయు వీలు కల్పిస్తుంది.
పరిశోధక శాస్త్రవేత్తల రాకపోకలు, వ్యవసాయ సమాచారం ఇంకా విజ్ఞాన శాస్త్ర సంబంధ ప్రచురణలు (పత్రికలు, పుస్తకాలు, బులెటిన్ లు, వ్యవసాయం, సంబంధిత రంగాలపై గణాంక సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం), వ్యవసాయ సంబంధ సాంకేతికతను, జర్మ్ ప్లాజమ్ ను మార్పిడి చేసుకోవడం, సంయుక్త చర్చాసభలు, కార్యశాలలు వంటివి నిర్వహించడం ద్వారా కూడా సహకారాన్ని పెంపొందించుకోనున్నారు.
ఈ ఎంఒయు లో భాగంగా, ద్వైపాక్షిక అంశాలలో సంప్రదింపులు సహా పరస్పర ప్రయోజనాలు ఇమిడివుండే అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జెడబ్ల్యుజి ని) ఏర్పాటు చేయనున్నారు. ఈ జెడబ్ల్యుజి ఉమ్మడి కార్యాచరణ ను రూపొందించడం కోసం మొదట్లో 2 సంవత్సరాల పాటు ఏడాది లో కనీసం ఒక సారి వంతున ఇటు భారతదేశం లోను, అటు ఈజిప్టు లోను సమావేశమవుతుంది.
**