Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రప‌తి జ‌న్మ‌దినం నాడు రెండు పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

రాష్ట్రప‌తి జ‌న్మ‌దినం నాడు రెండు పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

రాష్ట్రప‌తి జ‌న్మ‌దినం నాడు రెండు పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు “స్పీచెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వాల్యూమ్-iii”, ఇంకా ‘ప్రెసిడెన్షియ‌ల్ రిట్రీట్స్’ అనే రెండు పుస్త‌కాల‌ను విడుద‌ల చేశారు. రాష్ట్ర‌ప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఏర్పాటైన కార్య‌క్ర‌మాల‌లో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోని ద‌ర్బార్ హాల్‌లో జ‌రిగిన ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కూడా ఒక‌టి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ, 80 ఏళ్లు పూర్తి చేసుకొన్న‌రాష్ట్ర‌ప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్ర‌ప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ త‌న రాజ‌కీయ జీవ‌నంలో కేంద్ర ప్ర‌భుత్వంలో అనేక ఉన్న‌త ప‌ద‌వులను అలంక‌రించి, ఆయా ప‌ద‌వీబాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చార‌ని ప్ర‌ధాని అన్నారు. రాష్ట్రప‌తిగా శ్రీ ముఖ‌ర్జీతో క‌ల‌సి ప్ర‌ధానిగా ప‌నిచేసే అవ‌కాశం ల‌భించ‌డంతో త‌నను తాను అదృష్టవంతునిగా భావించుకొంటున్నాన‌ని శ్రీ మోదీ పేర్కొన్నారు.

రాష్ట్రప‌తిపైన వ‌చ్చిన పుస్త‌కాలు ఎంతో బాగా గ్రంథ‌స్త‌మైనాయ‌ని, అవి రాష్ట్రప‌తి ప‌దునైన‌, జ్ఞానాత్మ‌క‌మైన మ‌స్తిష్కపు అంత‌ర్‌దృష్టిని తెలియజేస్తున్నాయ‌ని ప్ర‌ధాని అన్నారు.